గంగవ్వ ఫిజికల్ టాస్క్ లు చేయలేరు. ఆమె వయసు అడ్డంకి కచ్చితంగా కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఆమె పెద్దగా సాధించింది కూడా లేదు. అయితే గంగవ్వ మై విలేజ్ షో లో వీడియోస్ ద్వారా ఎంత ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనేది అందరికీ తెల్సిందే. అయితే అదంతా స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేసిందే. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. పైగా బిగ్ బాస్ లో గంగవ్వకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి.
నిన్నటి టాస్క్ తీసుకుంటే గంగవ్వ వల్ల హ్యూమన్స్ ఆడలేము అని అన్నారు. ఎందుకంటే గంగవ్వ రోబోట్స్ ఎగ్స్ వద్ద నిలబడింది. ఆమెతో ఫిజికల్ గా పోటీ పడము అని చెప్పేసారు. గంగవ్వ కూడా పలుమార్లు నేను హౌస్ లో నుండి వెళ్ళిపోతాను అన్నట్లే మాట్లాడుతోంది. ఈ కారణాలతో బిగ్ బాస్ హౌస్ కు గంగవ్వ కరెక్ట్ కాదు అని అంటున్నారు.
మరి గంగవ్వ విషయంలో బిగ్ బాస్ ఏం చేస్తుందో చూడాలి.