తెలుగు బిగ్ బాస్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల అయిదు వారాల తర్వాత ఎలిమినేషన్ కాకుండానే బయటకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఎనిమిదవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి సింగర్ నోయల్ కూడా అనారోగ్య కారణాల వల్ల బయటకు వచ్చేశాడు. చాలా రోజులుగా ఆయనకు అనారోగ్య సమస్య ఉంది. హౌస్ లోనే వైధ్యులు అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో నోయల్ ను ప్రముఖుల వద్ద ట్రీట్మెంట్ కోసం బయటకు పంపించాల్సి వస్తుంది. మీరు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ హౌస్ లోకి వస్తారని ఆశిస్తున్నాం అంటూ బిగ్ బాస్ చెప్పి పంపించాడు.
బిగ్ బాస్ నుండి గతంలో ఇలాంటి పరిస్థితులతో వెళ్లి మళ్లీ వచ్చిన వారు ఉన్నారు. సీజన్ 2 లో నూతన్ నాయుడు వెళ్లి మళ్లీ వచ్చాడు. కనుక ఈసారి కూడా నోయల్ వస్తాడని అంతా భావిస్తున్నారు. కాని కరోనా పరిస్థితుల కారణంగా ఒకసారి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ లోనికి వెళ్లడం అనేది అత్యంత ప్రమాదంగా భావిస్తున్నారు. అయినా కూడా ఒకటి రెండు రోజులు జాగ్రత్తల మద్య ట్రీట్మెంట్ చేయించి బాగు అయితే అప్పుడు నోయల్ ను హౌస్ లోకి పంపించే అవకాశం ఉంది అంటున్నారు. విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్న నోయల్ కు ఇలాంటి పరిస్థితి కలగడం అభిమానులను కలవర పర్చతుంది.
ఇక నిన్నటి ఎపిసోడ్ ఇతర విషయాలకు వస్తే కెప్టెన్సీ అమ్మాయిలకు మాత్రమే అన్నట్లుగా ఈ వారం అమ్మాయిల మద్య కెప్టెన్సీ టాస్క్ ను నిర్వహించారు. అయితే అందుకోసం అబ్బాయిలు అమ్మాయిలకు హెల్ప్ చేయాలి. ఏ అమ్మాయి అయితే కెప్టెన్ అవ్వాలని భావిస్తున్నారో ఆ కీ ని మొదట తీసుకుని అబ్బాయిలు ఆ అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. మొదట అఖిల్ తీసుకుని మోనాల్ కు ఇచ్చేశాడు. మోనాల్ హారికను కెప్టెన్సీ టాస్క్ నుండి బయటకు పంపించడంతో ముగ్గురు మాత్రమే మిగిలి పోయారు. ఆ తర్వాత అరియానకు ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో లాస్యను పంపించింది.
చివరకు అరియానా మరియు మోనాల్ ల మద్య పోటీ ఉండగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ కీ తీసుకుని అరియానాకు ఇచ్చాడు. దాంతో మోనాల్ కూడా బయటకు వెళ్లి పోయింది. చివరకు తన కోరిక నెరవేరడంతో అరియానా ఎగిరి గంతేసింది. కెప్టెన్ గా అరియానా మారిపోయింది. అరియానా రేషన్ మేనేజర్ గా మోనాల్ ను ఎంపిక చేసింది. ఈ విషయం అమ్మ రాజశేఖర్‌కు నచ్చలేదు. తాను అరియానా కోసం కష్టపడితే మోనాల్‌కు ఎందుకు ఇవ్వాలి అంటూ ఫీల్ అయ్యాడు. ఆ సీన్ డ్రామా కొద్ది సమయం జరిగింది.