ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్ బాస్4: ఎపిసోడ్56-నోయల్‌ వెళ్లి పోతూ ఆ ముగ్గురిని ఎత్తాడు, ఆ ఇద్దరిని తోసేశాడు

బిగ్‌ బాస్‌ నుండి మరో షాకింగ్‌ ఎలిమినేషన్‌ జరిగింది. అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లిన నోయల్‌ మళ్లీ లోనికి వెళ్లడం లేదు. ఆయనకు ట్రీట్‌మెంట్‌ అవసరం అంటూ వైధ్యులు నిర్ణయించిన కారణంగా నోయల్‌ ను మళ్లీ హౌస్‌లోకి పంపడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్‌ కు ఎవరు హోస్ట్‌ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇస్తూ నాగార్జున వచ్చేశాడు. వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌ స్పాట్‌ నుండి ఎయిర్‌ పోర్ట్‌ వరకు చాప్టర్‌ లో అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నాడు. బిగ్‌ బాస్‌ కోసం ప్రత్యేకంగా ఆయన ఈ ప్రయాణం చేశాడు. ఆ విషయాన్ని కూడా నిన్నటి ఎపిసోడ్‌ లో చూపించారు. ఇక రావడం రావడంతోనే నాగార్జున కన్ఫెషన్‌ రూంకు కొందరిని పిలిచి గొడవలు పెంచే ప్రయత్నం చేశాడు. క్లారిటీ ఇస్తున్న పేరుతో కావాలని హౌస్‌ లో హీట్‌ పెంచారు.

హౌస్‌లో ఇన్ని రోజులు జరిగిన జర్నీలో మీకు విలన్‌ ఎవరు అంటూ ఒకొక్కరుగా ముళ్ల కిరీటం పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఇంటి సభ్యులు అందరు కూడా మొహమాటం లేకుండా తమకు ఎవరైతే విలన్‌ అనుకున్నారో వారికి కిరీటం పెట్టి ఎందుకు అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. అఖిల్‌ వెళ్లి తన విలన్‌ అభిజిత్‌ అన్నాడు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్న ఇంతకు ముందు జరిగిన జర్నీలో విలన్‌ అభిజిత్‌ అనడంతోఅభిజిత్‌ కూడా షాక్‌ అయ్యాడు. సోహెల్‌ తనకు స్వీట్‌ విలన్‌ అరియానా అంటూ చెప్పి పెట్టాడు. ఇక లాస్య వెళ్లి అవినాష్‌ విలన్‌ అంటూ కిరీటం పెట్టింది. అలాగే అవినాష్‌ కూడా లాస్యనే తన విలన్‌ అంటూ కిరీటం పెట్టాడు. అరియానా తన విలన్‌గా అఖిల్‌ ను చెప్పింది. అభిజిత్ చివరగా తన విలన్‌ అమ్మా రాజశేఖర్‌ అన్నాడు.. మోనాల్‌ విషయంకు వచ్చేప్పటికి లాస్యను విలన్‌ గా భావిస్తున్నట్లుగా చెప్పంది. ఇది జరిగిన తర్వాత అఖిల్‌ ను సేవ్‌ చేశారు.

నోయల్‌ స్టేజ్‌ పైకి రావడంతో అంతా కూడా విష్‌ చేశారు. ఎప్పుడు వస్తావు అంటూ ఎదురు చూస్తున్నాను అంటూ అంతా అన్నారు. ఆసమయంలో నాగార్జున ఇక నోయల్‌ రాడు అని చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు. ముఖ్యంగా హారిక ఏడుస్తూనే ఉంది. నా బ్యాక్‌ బోన్‌ తను అంటూ హారిక చెప్పిన వివరణ ప్రతి ఒక్కిరిని కదిలించింది అనడంలో సందేహం లేదు. ఇక నోయల్‌ వెళ్లి పోయే ముందు అయిదుగురు విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలు ప్రశంసలు తెచ్చి పెట్టింది. నా స్నేహితులు అయిన అభిజిత్‌, లాస్య, హారికలు ఫైనల్‌ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఉంటారు మీ కోసం నేను ఉన్నాను అన్నాడు. ఇక అమ్మ రాజశేఖర్‌ మరియు అవినాష్‌ లపై నోయల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అమ్మ మరియు అవినాష్‌ లను రెండు నిమిషాల పాటు ఒక కాలుపై నిలబడమన్నాడు. ఆ తర్వాత ఆ బాధ ఏంటో అర్థం అయ్యిందా అంటూ తనలో ఉన్న ఆవేదనను వెళ్లగక్కాడు. అంతకు మించి వెయ్యి రెట్ల నొప్పితో నేను బాధపడుతుంటే నా బాధను కామెడీ చేశారు. నా పెయిన్‌ను అవహేళన చేశారు. ఇదేనా కామెడీ అంటే అంటూ ఇద్దరిపై విమర్శలు చేశాడు. అందుకు అవినాష్‌ చాలా సీరియస్‌ అన్నాడు. ఇన్ని రోజులు చేసిన కామెడీకి నవ్వేసిన నువ్వు ఇప్పుడు బయటకు వెళ్లి ఇలా మాట్లాడటం ఏంటీ, ఇన్ని రోజులు సేఫ్‌ గేమ్‌ ఆడి ఇప్పుడు బయటకు వెళ్లగానే ఇద్దరిని బ్యాడ్‌ చేయాలని చూడటం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఎన్నో సార్లు నీ ముందు చేసినా కూడా నవ్వావు. అప్పుడే ఎందుకు అనలేదు అంటూ అవినాష్‌ ప్రశ్నించిన సమయంలో నోయల్‌ సైలెంట్‌ అయ్యాడు. మొత్తానికి ఆ ముగ్గురిని లోపే ప్రయత్నం చేసి అవినాష్‌ మరియు అమ్మను మాత్రం కిందకు తోసేందుకు నోయల్‌ చాలా గట్టిగా ప్రయత్నించాడు. నోయల్‌ పనికి నెటిజన్స్‌ కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నోయల్‌కు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Exit mobile version