అయితే కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇంటి సభ్యులు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం వల్ల అవతలి వారిని నొప్పించాల్సి ఉంటుంది. ఈ ఇంటి వారిని నొప్పించి సొంత ఇంటి వారిని కలుసుకునేలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు.
నిన్నటి ఎపిసోడ్ హాట్ హాట్ గా అయితే ఏం జరగలేదు. కాని అఖిల్ మరియు అభిజిత్ ల మద్య ఇష్యూ మరోసారి రైజ్ అయ్యింది. ఇద్దరు కూడా నాగార్జున ముందు మాట్లాడుకున్నారు. అంతకు ముందు రోజే స్నేహితులుగా కలిసి పోయిన వీరిద్దరు మళ్లీ ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతాడు అంటూ అభిజిత్ ను అఖిల్ అనడంతో అంతా కూడా సీన్ మారిపోయింది. ఆ రోజు ఏం జరిగింది ఏంటీ అనేది తెలుసుకోకుండా వివరణ ఇవ్వకుండా మాట్లాడేస్తాడు అంటూ అఖిల్ పై అభిజిత్ వ్యాఖ్యలు చేశాడు.
అఖిల్ ఆ సమయంలో కూడా అభిజిత్ ను మాట్లాడుకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో నాగార్జున కొద్ది సమయం ఆగు అఖిల్ అంటూ నోరు మూయించాడు. దాంతో అభిజిత్ తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సుదీర్ఘంగా క్లారిటీగా చెప్పేశాడు. మొత్తానికి అభిజిత్ మరియు అఖిల్‌ల మద్య ఇష్యూ మరోసారి గొడవకు దారి తీస్తుందని ముందు నుండి అనుకున్నట్లుగానే అయ్యింది. ఇక వచ్చిన ఇంటి సభ్యులతో టాప్ 5 ఎవరు అంటూ చెప్పించే ప్రయత్నం చేశారు.
అతి తక్కువ ఓట్లు వచ్చినందుకు గాను లాస్య, మోనాల్ మరియు అభిజిత్ లు తమకు ఇష్టమైన వస్తువులను త్యాగం చేయాల్సి వచ్చింది. సరదాగా ఇంటి సభ్యులతో మాట్లాడటంతో పాటు మళ్లీ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక చివర్లో సోహెల్ సేఫ్ అవ్వడం జరిగింది. ఇక నేటి ఎపిసోడ్ లో లాస్య ఎలిమినేట్ అయ్య అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగబోతుందో చూడాలి.
Share