Advertisement

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 79 – అఖిల్‌, మోనాల్‌ రిలేషన్‌ కట్‌.. అభిజిత్‌, హారిక రిలేషన్‌ మరింత స్ట్రాంగ్‌

Posted : November 24, 2020 at 11:48 am IST by ManaTeluguMovies

ప్రతి సోమ వారం మాదిరిగానే ఈ సోమవారం కూడా రచ్చతో ప్రారంభం అయ్యింది. అంతా అనుకున్నట్లుగానే సోమవారం ఎపిసోడ్‌ లో అఖిల్‌, మోనాల్‌ల మద్య గొడవ జరిగింది. అయితే అభిజిత్‌ మరియు అఖిల్‌ల మద్య ఎలాంటి చర్చ జరగలేదు. మొత్తానికి నామినేషన్‌ పక్రియ చాలా రసవత్తరంగా సాగింది. అంతకు ముందు అఖిల్‌ మరియు మోనాల్‌ల మద్య జరిగిన చర్చ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అఖిల్‌ ఓపెన్‌ అయ్యి ఇద్దరం కూడా ఎంత దూరం ఉండాలో అంత దూరం మెయింటెన్‌ చేద్దాం. నీకు ఏదైనా సాయం కావాలంటే తప్పకుండా చేస్తాను అంటూనే ఆమెను దూరంగా ఉండమంటూ సూచించాడు.

నీవు దూరంగా ఉండాలని భావించినప్పుడు నేను కూడా దూరంగా ఉండేందుకు సిద్దంగా ఉన్నాను అని మోనాల్‌ క్లారిటీగా చెప్పేసింది. ఈ వారం నామినేషన్‌ పక్రియలో ఒకరిని ఒకరు కాకుండా లక్‌ ఆధారంగా బిగ్‌ బాస్‌ నిర్ణయించాడు. హారిక కెప్టెన్‌ అవ్వడం వల్ల ఆమెకు ఇమ్యూనిటీ దక్కింది. ఆమె మినహా మిగిలిన ఆరు మంది నామినేషన్‌ పక్రియలో భాగంగా గార్డెన్‌ ఏరియాలో ఉన్న క్యాప్‌ లను ధరించాల్సి ఉంటుంది. క్యాప్‌ లు నాలుగు ఎరుపు రంగును కలిగి ఉంటాయి, మిగిలిన రెండు గ్రీన్‌ రంగును కలిగి ఉన్నాయి. తెలియకుండానే అభిజిత్‌, అఖిల్‌, అరియానా, అవినాష్‌ లు ఎరుపు రంగు ఉన్న టోపీలను ధరించారు. దాంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించారు.

పక్రియ దాంతో పూర్తి అవ్వలేదని బయట ఉన్న ఇద్దరితో స్వాప్‌ చేసుకునే అవకాశం ఉందని బిగ్‌ బాస్‌ చెప్పడంతో నలుగురు కూడా మోనాల్‌ మరియు సోహెల్‌ లను కన్విన్స్‌ చేసేందుకు ప్రయత్నించారు. అంతా కూడా మోనాల్‌ ను కన్విన్స్‌ చేశారు. నీ కంటే మేము స్ట్రాంగ్‌ ఖచ్చితంగా నీవు ఇక్కడ ఉండాలి అంటూ మోనాల్‌ ను నామినేట్‌ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరారు. ముఖ్యంగా అఖిల్‌ ఈ విషయంలో మోనాల్‌ తో చాలా సమయం చర్చించాడు. నీవే అన్నావు నేను చాలా స్ట్రాంగ్‌ అని.. అలాంటప్పుడు నీవు నామినేట్‌ అవ్వొచ్చు కదా అంటూ అఖిల్‌ పాయింట్‌ తీసినప్పుడు మోనాల్‌ నిర్మొహమాటంగా నో చెప్పింది. ఉదయమే నువ్వు ఎవరి గేమ్‌ వాళ్లం ఆడుదాం అంటూ చెప్పావు. ఇప్పుడు అదే నేను చేస్తున్నాను అంది.

మోనాల్‌ ను ఒప్పించేందుకు అందరు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆమె చాలా మొండిగా నో చెప్పింది. ప్రోమోలో అభిజిత్‌ కోసం మారుతున్నట్లుగా అనిపించినా కూడా అక్కడ జరిగింది వేరు. కెప్టెన్‌ హారిక తన పవర్‌ ను ఉపయోగించి ఒకరిని స్వైప్‌ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆమె మోనాల్‌ ను అభిజిత్‌ తో రిప్లేస్‌ చేసింది. దాంతో ఈ వారం నామినేషన్‌లో అరియానా, అఖిల్‌, అవినాష్‌ మరియు మోనాల్‌లు ఉన్నారు. అదృష్టం కొద్ది సోహెల్‌ లేకపోవడంతో అతడు మరో వారం లక్కీగా సేవ్‌ అయ్యే అవకాశంను దక్కించుకున్నాడు. వరుసగా నామినేట్‌ అవుతూ వస్తున్న అభిజిత్‌ ఈ వారం కెప్టెన్‌ హారిక వల్ల సేవ్‌ అయ్యాడు. వీరిద్దరి మద్య ఉన్న బాండింగ్‌కు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు.


Advertisement

Recent Random Post:

రాజమండ్రి బరిలో పురందేశ్వరి ? | Daggubati Purandeswari Contesting From Rajahmundry MP Seat?

Posted : March 24, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

రాజమండ్రి బరిలో పురందేశ్వరి ? | Daggubati Purandeswari Contesting From Rajahmundry MP Seat?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement