ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

Bigg Boss 4; నామినేషన్‌ లో అభిజిత్‌, అఖిల్‌లకు షాక్‌ ఇచ్చిన హారిక, మోనాల్‌.. వీరి గొడవతో వారిద్దరు సేఫ్‌

నామినేషన్‌ లో అభిజిత్‌, అఖిల్‌లకు షాక్‌ ఇచ్చిన హారిక, మోనాల్‌.. వీరి గొడవతో వారిద్దరు సేఫ్‌

బిగ్‌ బాస్‌ 13వ వారం మొదలైంది. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్‌ పక్రియ హాట్‌ హాట్‌ గా జరిగింది. ఈసారి ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ మొత్తం కూడా షాకింగ్‌ గా జరిగింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు సైతం ఆశ్చర్యపోయే విధంగా జరిగింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అభిజిత్‌ ను హారిక నామినేట్‌ చేసింది. ఇదే సమయంలో అఖిల్‌ పై మోనాల్‌ కోపం తెచ్చుకుంది. ఇద్దరి మద్య మళ్లీ రచ్చ కొనసాగింది. టాస్క్‌ చేయని కారణంగా అభిజిత్‌ ను నామినేట్‌ చేస్తున్నట్లుగా హారిక ప్రకటించింది.

శనివారం ఎపిసోడ్‌ లో కెప్టెన్‌ అయ్య ఉండి అభిజిత్‌ తో టాస్క్‌ చేయించాల్సి ఉండే. కాని నువ్వు ఆ పని చేయలేక పోయావు అంటూ నాగార్జున ఆమెను మందలించాడు. అందుకే ఆమె అభిజిత్‌ ను నామినేట్‌ చేసింది. ఆ సమయంలో ఆమె మౌనంగా ఉండి నేడు అభిజిత్‌ ను నామినేట్‌ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక అరియానా మరియు మోనాల్‌ మద్య గొడవ తారా స్థాయికి చేరింది. ఆ సమయంలో అవినాస్‌ తెలుగులో మాట్లాడాల్సిందిగా చెప్పగా అతడిపై కూడా మోనాల్‌ విరుచుకు పడినట్లుగా మాట్లాడింది. ఈ సమయంలో మోనాల్‌ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఆమె తీరు గతంతో పోల్చితే పూర్తిగా మారిపోయింది.

మొత్తంగా ఏడుగురు ఉండగా అరియానా మరియు సోహెల్‌ లు సేవ్‌ అవ్వగా మిగిలిన అయిదురుగు నామినేట్‌ అయ్యారు. అవినాష్‌, అభిజిత్‌, అఖిల్‌, హారిక మరియు మోనాల్‌ లు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. ఈ అయిదుగురిలో ఒకరు ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉంది. సోహెల్‌ మరియు అరియానాలను ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకున్నారు. అంతకు మించ వారికి ఓట్లు రాలేదు. దాంతో వారిద్దరు సేవ్‌ అయ్యారు. ఈ వారంలో వీక్‌ కంటెస్టెంట్‌ ఎవరై ఉంటారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version