శనివారం స్టార్ మా వర్గాల వారు కావాలని మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ లీక్ ఇచ్చారు. కాని నిన్నటి నుండి కూడా దేవి ఎలిమినేషన్ అయ్యింది అంటూ ప్రచారం మొదలు అయ్యింది. మెహబూబ్ కాకుండా దేవి ఎలిమినేట్ అవ్వడం ఏంటీ అంటూ చాలా మంది అనుకున్నారు. ఫేక్ ఎలిమినేషన్ అయినా అయ్యి ఉండాలి లేదంటే అది తప్పుడు ప్రచారం అయ్యి ఉండాలంటూ కొందరు భావించారు. షో ను చాలా ఉత్కంఠభరితంగా చూసిన వారికి షాక్ ఇస్తూ దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యింది. చివరి నిమిషం వరకు కుమార్ సాయి మరియు దేవి నాగవల్లి ఎలిమినేషన్ లో ఉన్నారు. చివరకు రంగు లో చేయి పెట్టగా కుమార్ సాయికి గ్రీన్ రాగా దేవికి మాత్రం రెడ్ వచ్చింది.
రెడ్ వచ్చిన దేవి ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపించే క్రమంలో అందరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా అరియానాకు దేవి బాగా కనెక్ట్ అయ్యింది. ఇద్దరు కూడా ముందు రోజు అంతకు ముందు రోజు కూడా చాలా ఎక్కువ సమయం గడిపినట్లుగా మనం చూడవచ్చు. ఈ ఇద్దరు కూడా లేడీ బిగ్ బాస్ గా నిలుస్తాం అంటూ వచ్చామని చాలెంజ్ చేశారు. అందుకే దేవికి అరియానాకు బాగా కనెక్షన్ కుదిరింది. అందుకే దేవి ఎలిమినేట్ అనగానే అరియానా గట్టిగా ఏడ్చేసింది. దాదాపు అంతా కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవి స్టేజ్ పైకి వెళ్లిన తర్వాత కూడా చాలా విభిన్నంగా ఒకొక్కరి గురించి మాట్లాడటం జరిగింది.
రెండు వారాల క్రితం అమ్మ రాజశేఖర్ మరియు దేవిల మద్య చిన్నపాటి యుద్దమే జరిగింది. కాని అది కూడా సమసి పోయి దేవి ఎలిమినేట్ సమయంలో అమ్మ రాజశేఖర్ కన్నీరు పెట్టకున్నాడు. మొత్తానికి దేవి ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులకు కూడా షాకింగ్‌గా ఉంది. నెటిజన్స్ దేవి ఎలిమినేషన్ అవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ పక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్ సాయి, మెహబూబ్ వంటి వీక్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉండగా దేవి ఎలా ఎలిమినేట్ అవుతుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆమె ప్రవర్తన కారణంగా ప్రేక్షకులు ఆమెను అర్థం చేసుకోక పోవడంతో పాటు ఏదో తప్పు జరిగిందని నెటిజన్స్ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.