Advertisement

సోహెల్‌ తెలివైన నిర్ణయం.. విజేత కంటే ఎక్కువ మొత్తం గెలుచుకున్నాడు

Posted : December 20, 2020 at 11:24 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 లో అనూహ్యంగా స్టార్‌ అయిన సోహెల్‌ ఫైనల్‌ 5 వరకు వచ్చాడు. అతడికి పెరిగిన ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదనే విషయం తెల్సిందే. బిగ్ బాస్ ఈ సీజన్‌ విన్నర్‌ కు 50 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ ఇవ్వబోతున్నట్లుగా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. టాప్‌ 3 లో ఉన్న వారు ఒకరు 25 లక్షలు తీసుకుని బయటకు వెళ్లి పోవచ్చు. మిగిలిన వారిలో ఒకరు విజేతగా నిలుస్తారు. వారికి 25 లక్షలు వస్తాయి అంటూ నాగార్జున ప్రకటించండంతో చాలా ఆలోచించిన సోహెల్‌ తాను తీసుకుంటాను అన్నాడు.

సోహెల్‌ కుటుంబ సభ్యులు కూడా తీసుకోవాలని సూచించారు. దాంతో మరో ఆలోచన లేకుండా తీసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అయిదు లక్షలు అనాధ ఆశ్రమానికి మరో అయిదు లక్షలు మెహబూబ్‌ కు ఇస్తాను అంటూ పేర్కొన్నాడు. నాకు వద్దు అనాధలకే ఇద్దాం అంటూ మెహబూబ్‌ కూడా అనడంతో వారిద్దరి బాండింగ్ నచ్చిన నాగార్జున మీ ఇద్దరికి నేను 10 లక్షలు ఇస్తానంటూ చెప్పాడు. దాంతో సోహెల్‌ గెలుచుకున్నది 35 లక్షలు అయ్యింది. అంటే విన్నర్‌ గా నిలిచిన వారి కంటే సోహెల్‌ కు ఎక్కువ వచ్చింది. మంచి మనసు చాటుకున్న నాగార్జునకు సోహెల్‌ మరియు మెహబూబ్‌ లు పాదాభివందనం చేశారు. సోహెల్‌ నిర్ణయంను అంతా అభినందిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Posted : December 2, 2024 at 2:05 pm IST by ManaTeluguMovies

India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad