ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్ బాస్ 5: ఇమ్మ్యూనిటి టాస్క్ లో షణ్ముఖ్ ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 5 లో నిన్న జరిగిన నామినేషన్స్ టాస్క్ లో ఒక్క కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరూ నామినేషన్స్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈరోజు దానికి కొనసాగింపుగా ఇమ్మ్యూనిటి టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారంగా గార్డెన్ ఏరియాలో మూడు జోన్లు ఉంటాయి. ఒకటి బ్యాగేజ్ జోన్, రెండోది సేఫ్ జోన్, మూడోది డేంజర్ జోన్.

నామినేషన్స్ లో ఉన్న సిరి, కాజల్, ప్రియాంక, ఎన్నీ, శ్రీరామ్, మానస్, సన్నీ, విశ్వ, జెస్సీ, రవిల బ్యాగ్ లు బ్యాగేజ్ జోన్ లో ఉంటాయి. బజర్ మోగిన వెంటనే ఇంటి సభ్యులు తమ ఫేస్ స్టిక్కర్ ఉన్న బ్యాగ్ కాకుండా వేరే ఎవరిదైనా బ్యాగ్ ను తీసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి. ఆఖరుగా ఎవరైతే సేఫ్ జోన్ లోకి వస్తారో వారు, వారు పట్టుకున్న బ్యాగ్ కు స్టిక్కర్ ఉన్న వారు డేంజర్ జోన్ లోకి వస్తారు. డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరూ కూడా తమకు ఇమ్మ్యూనిటి ఎందుకు అవసరమో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు సేఫ్ అవుతారు, అంటే మళ్ళీ గేమ్ లోకి వస్తారు. డేంజర్ జోన్ లో తక్కువ ఓట్లు వచ్చిన వారు నామినేషన్స్ లోకి వస్తారు.

ఈ క్రమంలో ఫస్ట్ రౌండ్ లో శ్రీరామ్ అందరికన్నా ఆఖరుగా రాగా అతను కాజల్ బ్యాగ్ ను పట్టుకోవడంతో ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వచ్చారు. ముందుగా వచ్చినా కూడా శ్రీరామ్ కావాలని సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా ఆగిపోయాడు. ఈ రౌండ్ లో శ్రీరామ్ సేఫ్ అవ్వగా కాజల్ నామినేషన్స్ లో నిలిచింది. ఆ తర్వాతి రౌండ్ నుండి సంచాలక్ అయిన షణ్ముఖ్ ఒక బ్యాగ్ తో మరో బ్యాగ్ కు ముడిపెట్టి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇది కంటెస్టెంట్స్ కు ఒకింత షాకింగ్ గా అనిపించింది. ఆ తర్వాతి రౌండ్స్ లో జెస్సీ, సిరి, శ్రీరామ్, రవి, మానస్, ఎన్నీ సేఫ్ అవుతూ వచ్చారు. లాస్ట్ గా ఎన్నీ మాస్టర్, శ్రీరామ్ డేంజర్ జోన్ లో నిలవగా ఎక్కువ ఓట్లు రావడంతో ఎన్నీ మాస్టర్ నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యారు.

ఆ తర్వాత బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎన్నీ మాస్టర్ గెలుచుకున్న బిగ్ బాస్ షీల్డ్ తో నామినేషన్స్ లో ఉన్న ఎవరినైనా సేవ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు, తనకు లెటర్ ను సేవ్ చేసిన మానస్ ను ఎన్నీ మాస్టర్ సేవ్ చేసారు. దీంతో ఫైనల్ గా నామినేషన్స్ లోకి సిరి, కాజల్, ప్రియాంక, రవి, విశ్వ, శ్రీరామ్ చంద్ర, జెస్సీ, సన్నీలు ఈసారి నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.

Exit mobile version