Advertisement

బిగ్ బాస్ 5: సిరి ఎమోషనల్ జర్నీ.. ఫైనలిస్ట్ మ్యాజిక్ మూమెంట్స్

Posted : December 16, 2021 at 1:10 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వీక్ లో ఫైనలిస్ట్ ల జర్నీ ప్రయాణం నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. మొదటి రెండు రోజులు శ్రీరామ్ చంద్ర, మానస్, షణ్ముఖ్, సన్నీల ప్రయాణం ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో సిరి జర్నీని చూపించారు. అయితే దానికంటే ముందు హౌజ్ మేట్స్ అందరూ కలిసి బోర్ ను తగ్గించుకోవడానికి దాగుడు మూతలు ఆడారు. హౌజ్ లోనే అందరూ దాక్కుంటే ఒకరు వారిని పట్టుకోవాలి. అందరికీ తెల్సిన ఆటే ఇది. కాసేపు అందరూ గొడవలు పక్కన పెట్టి ఇది ఆడటం బాగుంది. ఆ తర్వాత సన్నీ, మానస్ కలిసి రాక్, పేపర్, సిజర్ ఆడారు.

దాని తర్వాత సన్నీ, మానస్ ను ఈ బిగ్ బాస్ లో అస్సలు గేమ్ నచ్చని కాండిడేట్ ఎవరు అని అడగ్గా మానస్ ఏ మాత్రం సందేహించకుండా శ్రీరామ్ చంద్ర పేరు చెప్పాడు. శ్రీరామ్ గేమ్ తనకు అస్సలు నచ్చదని తెలిపాడు.

ఇక ఆ రోజు రాత్రి సిరి జర్నీ వీడియో మొదలైంది. సిరి తన ఫోటోలను చూసుకుని చాలా మురిసిపోయింది. ముఖ్యంగా సిరి, షణ్ముఖ్, జెస్సీల మోజ్ రూమ్ ఫోటో చూసి ఆనందించింది. అన్ని టాస్క్ లకు సంబంధించిన ప్రాపెర్టీలను చూసుకుని వాటిని గుర్తుచేసుకుంది. ఇక బిగ్ బాస్ చూపించిన జర్నీ వీడియోకు ఫిదా అయ్యింది. ఆ వీడియోలో సిరి పడిన కష్టం, ఆమె ఆనంద క్షణాలు, షణ్ముఖ్ తో జరిగిన రిలేషన్ గొడవలు, సన్నీతో టాస్క్ పరంగా జరిగిన వాదనలు అన్నీ ఉన్నాయి. ఆ వీడియోలో మానస్ – షణ్ముఖ్, సిరి ఇద్దరూ కంటెంట్ ఇవ్వడానికే వచ్చారురా బాబు అని అనడం చూసి సిరి షాక్ అయింది. మొత్తంగా తన జర్నీ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. దాని తర్వాత ఒక ఫోటోను బిగ్ బాస్ తీసుకెళ్లమని అడిగితే సిరి చాలా ఫోటోలను తీసుకెళ్లింది.

ఇది జరిగిన కొంచెం సేపటి తర్వాత బిగ్ బాస్ మరో చిన్న టాస్క్ ను ఇచ్చాడు. ఈ బిగ్ బాస్ జర్నీలో మర్చిపోలేని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫొటోస్ ను పెట్టి, ప్రతీ హౌజ్ మేట్ ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుని దాని గురించి చెప్పాల్సి ఉంటుందని అన్నాడు. దాని తర్వాత ఒక సందేశాన్ని రాసి బిగ్ బాస్ కు ఇవ్వాలి. ఇందులో శ్రీరామ్, హమీదతో ఉన్న ఫోటోను సెలెక్ట్ చేసుకోగా, మానస్ బెటన్ టాస్క్ ఫోటో, షణ్ముఖ్ లెటర్ ష్రెడ్ ఫోటో, సిరి బ్రిక్స్ టాస్క్, సన్నీ తనకు వరస్ట్ పెర్ఫార్మెర్ ఇచ్చిన ఫోటోలను సెలెక్ట్ చేసుకున్నారు.


Advertisement

Recent Random Post:

Burning Topic : కలవరమాయే కూటమిలో..!! | TDP-Janasena-BJP Alliance | AP Elections 2024

Posted : March 26, 2024 at 11:27 am IST by ManaTeluguMovies

Burning Topic : కలవరమాయే కూటమిలో..!! | TDP-Janasena-BJP Alliance | AP Elections 2024 \

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement