Advertisement

బిగ్ బాస్ 5: కాజల్ ను కార్నర్ చేద్దామనుకుని తనే కార్నర్ అయిపోయిన శ్రీరామ్

Posted : November 23, 2021 at 12:00 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ 5 లో మొదటి నుండి ఆసక్తికరంగా అనిపించే రోజు అంటే శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం. అవును, నామినేషన్స్ ఎపిసోడ్ మొదటి నుండి అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ సోమవారం ఎపిసోడ్ కూడా ఫుల్ ఫైర్ తో నడిచింది. కంటెస్టెంట్స్ ముందు దిష్టిబొమ్మలను పెట్టి, ఒక్కో హౌజ్ మేట్ ఇద్దర్ని నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పి వారి దిష్టిబొమ్మపై కుండ పెట్టి దాన్ని పగలకొట్టాల్సి ఉంటుంది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ ను రవి మొదలుపెట్టాడు. మొత్తం నామినేషన్స్ ప్రాసెస్ ఈ విధంగా జరిగింది.

రవి – సన్నీ, కాజల్ లను నామినేట్ చేసాడు

ప్రియాంక – సిరి, షణ్ముఖ్

షణ్ముఖ్ – రవి, కాజల్

శ్రీరామ్ – సన్నీ, కాజల్

సన్నీ – రవి, శ్రీరామ్

సిరి – ప్రియాంక, రవి

కాజల్ – రవి, శ్రీరామ్

మానస్ – శ్రీరామ్, రవి

ఈ నామినేషన్స్ లో ఎక్కువగా రవి, సన్నీ, శ్రీరామ్ చంద్ర, కాజల్ లు ఫైర్ అయ్యారు. ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర – కాజల్ ల మధ్య జరిగిన నామినేషన్స్ గొడవ ఆసక్తికరంగా అనిపించింది. కాజల్ ఫైర్ ట్రక్ ఎక్కినప్పుడు సన్నీని సేవ్ చేయడం కోసం సిరి, ఎన్నీలను ఎలిమినేట్ చేయడం నచ్చలేదని శ్రీరామ్ చంద్ర మొదలుపెట్టాడు. నిజానికి ఇందులో కాజల్ చేసిన తప్పు అంటూ ఏం లేదు. తన ఫ్రెండ్ ను తను సేవ్ చేయాలని అలా చేసానని చెప్పింది. నాగార్జున కూడా కాజల్ చేసిన దాంట్లో తప్పేం లేదని చెప్పాడు.

అయినా కూడా శ్రీరామ్ చంద్ర అదే పాయింట్ ను తీసుకుని నువ్వు సరిగ్గా ఆడి ఉంటే ఎన్నీ మాస్టర్ ఇక్కడ ఉండేవారు అన్నాడు. ఎన్నీ మాస్టర్ ఇక్కడ ఉండటం కోసం కాదుగా కాజల్ గేమ్ ఆడింది. అయినా ఎన్నీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వాలని కూడా తను చేయలేదు. శ్రీరామ్ చంద్ర ఆమె ఎలిమినేట్ అవుతుందని ఊహించాడట. అందుకే ఆమెకు ఎవిక్షన్ పాస్ ఇస్తే బాగుండేదని కూడా ఫీల్ అయ్యాడట. మరి అలాంటప్పుడు ఫైర్ ట్రక్ ఎక్కడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు. వేరే వాళ్లకు అవకాశం ఇచ్చి తనెందుకు బ్లేమ్ చేయడం?

అలాగే సన్నీతో కూడా శ్రీరామ్ చంద్ర గొడవ పడిన విధానం సరిగా లేదు. చాలా ఈజీగా ప్రవోక్ అయిపోయినట్లుగా అనిపించింది. నామినేట్ చేస్తోన్న సన్నీ మీదకు వెళ్లిపోవడం కూడా అర్ధం కాలేదు. సన్నీ, కాజల్ లను టార్గెట్ చేద్దామనుకున్న శ్రీరామ్ తనే టార్గెట్ అయిపోయాడు. ఈజీగా ప్రవోక్ అయిపోయాడు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉండే శ్రీరామ్ ఇలా అయిపోవడం ప్రేక్షకులకు కూడా కొంత షాక్ లాంటిదే.


Advertisement

Recent Random Post:

ఈసీకి చేరిన విశాఖ డ్రగ్స్ పంచాయితీ l Visakha Drugs Case l AP Election Roundup

Posted : March 22, 2024 at 7:31 pm IST by ManaTeluguMovies

ఈసీకి చేరిన విశాఖ డ్రగ్స్ పంచాయితీ l Visakha Drugs Case l AP Election Roundup

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement