Advertisement

బిగ్ బాస్ 5: ఈసారి పెద్ద పేర్లే వినబడుతున్నాయిగా

Posted : January 29, 2021 at 8:19 pm IST by ManaTeluguMovies

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ 4 ఆలస్యంగా మొదలైన విషయం తెల్సిందే. అందులోనూ పెద్దగా పేరున్న మొహాలు హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడంతో సీజన్ మొదట్లో షో పై బాగానే ట్రోల్స్ నడిచాయి.

అయితే నిర్వాహకులు మాత్రం బిగ్ బాస్ ను హిట్ చేయడంలో సక్సెస్ సాధించారు. మిగిలిన సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ 4 టిఆర్పిల పరంగా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5ను ఈ ఏడాది ముందు అనుకున్న దానికంటే ముందే నిర్వహించాలని భావిస్తున్నారు.

రెండు నెలల్లో బిగ్ బాస్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. దీనికోసం నిర్వాహకులు పనులను ఇప్పటినుండే మొదలుపెట్టారు. ఈసారి బాగా పేరున్న వారినే షో లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం యాంకర్ రవి, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిలను సంప్రదిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Advertisement

Recent Random Post:

Minister Anil Kumar Yadav Sensational Comments on TDP Chandrababu Naidu

Posted : October 25, 2021 at 5:55 pm IST by ManaTeluguMovies

Minister Anil Kumar Yadav Sensational Comments on TDP Chandrababu Naidu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement