విజేతల్లో ఒక్కరిగా అభిజిత్ మరియు అఖిల్ లను ప్రకటించాల్సి ఉండగా నాగార్జున ఇద్దరు చేతులను పట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. సస్పెన్స్ కు తెర దించి అఖిల్ చేతిని ఒక్క సారిగా కిందకు దించి విసిరేసినట్లుగా వదిలేసి అభిజిత్ చేతిని పట్టుకున్నాడు. అఖిల్ ను కసిగా వెనక్కు విసిరేసినట్లుగా అనిపించింది. అలా చేయడం పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తుండగా అఖిల్ తల్లి దుర్గ కూడా స్పందించారు. నాగార్జున గారు సీజన్ మొత్తం చక్కగా హోస్టింగ్ చేశారు. అయితే చివర్లో అలా చేయడం నాకు కాస్త బాధగా అనిపించింది అంటూ పేర్కొంది. నా కొడుకును అలా విసిరేసినట్లుగా చేయడంతో తల్లిగా బాధ పడ్డట్లుగా దుర్గ అన్నారు.