ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు..! ఉద్యోగులు నోరు జారొద్దు: మంత్రి బొత్స

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపధ్యంలో మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పీఆర్సీపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని అన్నారు.

ఉద్యోగులను చర్చలకు పిలిచి మూడు రోజులు ఎదురు చూసినా వారు రాకుండా ద్వితీయ శ్రేణి నేతలను పంపారని అన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని మంత్రి బొత్స తెలిపారు. ఉద్యోగుల కోరికలు సమంజసంగా ఉండాలని.. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అన్నారు.

ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించకుండా నిరసన చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని.. తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు మాట తూలితే దానికి సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బాద్యతగా మెలుగుతూ మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయట్లేదని అన్నారు.

Exit mobile version