Advertisement

‘గీతాఆర్ట్స్‌’ ముందు మహిళ ఆత్మహత్య యత్నం

Posted : July 14, 2021 at 12:08 pm IST by ManaTeluguMovies

నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని.. సినిమాల్లో అవకాశాలు ఇస్తానంటూ మోసగించాడు అంటూ గత కొన్ని రోజులుగా మలక్ పేటకు చెందిన సునీత ఆరోపణలు చేస్తూ వస్తోంది. గతంలో కూడా ఈమె సోషల్‌ మీడియాలో పదే పదే బన్నీ వాసు గురించి వ్యాఖ్యలు చేయడంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడం.. ఆమె జైలుకు వెళ్లడం కూడా జరిగింది. ఆమెను పోలీసులు ఎర్రగడ్డకు కూడా తీసుకు వెళ్లారు. అయినా కూడా ఆమె లో మాత్రం మార్పు రాలేదు.

ఇటీవల బన్నీ వాసు మోసం కు తాను ఆత్మహత్య చేసుకుంటాను అని, గీతా ఆర్ట్స్‌ ఆఫీస్ వద్ద తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన సునీత అన్నట్లుగానే మంగళవారం నాడు గీతాఆర్ట్స్ ఆఫీస్‌ ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఆఫీస్ వద్ద హడావుడి చేసింది. ఆఫీస్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. న్యాయమూర్తి ముందుకు తీసుకు వెళ్లిన వారు ఆమెను ఎర్ర గడ్డ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ విషయమై బన్నీ వాసు నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.


Advertisement

Recent Random Post:

UNITE🇮🇳 & CREATE HISTORY | GULSHAN KUMAR’S VISION | SUBSCRIBE TO BE A PART

Posted : April 15, 2024 at 6:41 pm IST by ManaTeluguMovies

UNITE🇮🇳 & CREATE HISTORY | GULSHAN KUMAR’S VISION | SUBSCRIBE TO BE A PART

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement