Advertisement

హైదరాబాద్ వర్షాలకు మునిగిన సినీ నటుడు బ్రహ్మాజీ ఇల్లు

Posted : October 19, 2020 at 11:10 pm IST by ManaTeluguMovies

హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా ఏ స్థాయిలో వర్షం కురిసిందో మనందరం చూసాం. ఈ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. కాలనీలు అన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల దాదాపు 8 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో హైదరాబాద్ వాసుల కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా హైదరాబాద్ లో వర్షాలు భీభత్సం సృష్టించాయనే చెప్పాలి.

ఈ హైదరాబాద్ వర్షాలకు సెలబ్రిటీలు కూడా నానా ఇక్కట్లు పడ్డారు. సినీ నటుడు బ్రహ్మాజీ తాజాగా పెట్టిన పోస్ట్ ఇందుకు నిదర్శనమని చెప్పాలి. ఇది నా ఇల్లు అంటూ నిలిచిన వర్షపు నీటిలో చిక్కుకున్న తన ఇంటి ఫోటోను పోస్ట్ చేసాడు బ్రహ్మాజీ. మోకాళ్ళ లోతుకు పైగా నీరు బ్రహ్మాజీ ఇంటి చుట్టూ చేరడం గమనార్హం. తన నివసిస్తోన్న కాలనీ ఫోటోను కూడా పోస్ట్ చేయగా అక్కడ కార్ టైర్లు మునిగిపోయే రేంజ్ లో వర్షపు నీరు చేరింది.

కొంచెం నిలిచిన నీరు తగ్గుతోంది అనుకునేలోపే మళ్ళీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడా నీటి నిల్వ తగ్గడంలేదు. ఆకాశం కొంచెం మేఘావృతమైనా మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందోనని హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు.


Advertisement

Recent Random Post:

AP CM Jagan : బస్సుయాత్రలో పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్

Posted : March 28, 2024 at 5:22 pm IST by ManaTeluguMovies

AP CM Jagan : బస్సుయాత్రలో పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement