Advertisement

నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

Posted : December 12, 2020 at 12:25 pm IST by ManaTeluguMovies

అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బన్నీ వాసు ప్రస్తుతం టాలీవుడ్‌ లో ప్రముఖ నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో ఈయన నిర్మిస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. సినీ కెరీర్‌ పరంగా బన్నీ వాసు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సురేష్‌ నిన్న రాత్రి బెంగళూరులో కన్నుమూశారు. అక్కడ ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ గా వ్యవహరిస్తున్న బన్నీ వాసు అనారోగ్యంతో కన్నుమూశారు.

సుదీర్ఘ కాలంగా కిడ్నీలకు సంబంధించిన సమస్యలను సురేష్‌ ఎదుర్కొంటున్నారు. కిడ్నీలు రెండు కూడా చెడి పోవడంతో చివరకు సురేష్‌ నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సురేష్‌ భార్య మరియు కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. సోదరుడి మరణ వార్త తో బన్నీ వాసు శోఖంలో మునిగి పోయాడు. అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు బన్నీ వాసును పరామర్శించారు. సురేష్‌ అంత్య క్రియల విషయం ఏంటీ అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

జగన్ ర్యాంప్ వాక్ @ కాకినాడ | AP CM YS Jagan Public Meeting at Kakinada | Memantha Siddham

Posted : April 19, 2024 at 9:25 pm IST by ManaTeluguMovies

జగన్ ర్యాంప్ వాక్ @ కాకినాడ | AP CM YS Jagan Public Meeting at Kakinada | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement