ఇలా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు వెంట ఉంటున్నది 18 మంది ఎమ్మెల్యేలు అనే నంబర్ వినిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దూరం అవుతున్న వారిని, దూరం కాబోతున్న వారికి చంద్రబాబు నాయుడు భారీ ఆఫర్లను ఇస్తున్నట్టుగా భోగట్టా!
అదేమిటంటే.. పార్టీలోనే రాబోయే నాలుగేళ్లూ ఉంటే 50 కోట్ల రూపాయల వరకూ ప్యాకేజట! ఇది డైరెక్టు ప్యాకేజ్ అని, పార్టీతోనే ప్రయాణం చేస్తే ఏడాదికి పది కోట్ల రూపాయల పైనే లాభం ఉంటుందనే ఆఫర్లను ఇస్తున్నారట. తన వెంట ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉన్నారని టాక్. 50 కోట్ల రూపాయలు అంటే మాటలేమీ కాదు. నాలుగేళ్ల కాలక్షేపానికి ఆ మాత్రం ప్యాకేజీ అంటే చంద్రబాబు నాయుడు తన వంతుగా బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టే. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడూ ఎమ్మెల్యేలను కొని, ఇప్పుడు అధికారం కోల్పోయాకా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనాల్సి వస్తోందా? అనేది!
అప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే హోదాలతో ఎవరు వచ్చినా వాళ్లను కొన్నారు. కండువాలు వేశారు. ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేర్చుకోకపోయినా టీడీపీ ఎమ్మెల్యేలు ఎలాగోలా పచ్చకండువా బరువును దించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో కొద్దిమంది ఎమ్మెల్యేలను అయినా వెంట నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, ఒక్కోరికి 50 కోట్ల రూపాయల మేరకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆఫర్ తో ఎంతమంది ఎమ్మెల్యేలు తాము టీడీపీ నే అని ప్రకటిస్తారో!