ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పోలవరంపై మేం చిత్తశుద్ధిగా పని చేసాం.. వైసీపీ తప్పు చేస్తోంది: చంద్రబాబు

‘పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని భావించాం. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తూ 70% పైగా పూర్తి చేశాం. పోలవరం పనుల పురోగతిని నితిన్ గడ్కరీ అభినందించారు కూడా. ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారమిచ్చి నిధులు రాబట్టగలిగాం. వైసీపీ ప్రభుత్వం వాస్తవాలు తెలీక టీడీపీపై నిందలు వస్తోంది. కేంద్రంతో చర్చించకుండా సీఎం లేఖ రాయడం తప్పు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తామేం చేసామో చెప్తూ.. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

అంచనాల వ్యయం పెంపులో అవినీతి జరిగిందని గతంలో వైసీపి దుష్ప్రచారం చేసింది. ఆర్ ఆండ్ ఆర్ పెంపు వల్లనే పోలవరం అంచనా వ్యయం పెరిగిందని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో వైసిపి చేసిన ఆరోపణలు తప్పుడువని వాళ్లే ఒప్పుకున్నట్టైంది. కేంద్రానికి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి ఎంతో చులకన అయ్యారు. కేంద్రానికి ఏం సమాధానం చెప్తారు? బుద్ధి, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు.

నిపుణులను సంప్రదించి బాధ్యతగా చేయాల్సింది చేయకుండా రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టారు. వైసీపీ నాయకులు అవగాహన లేకుండా, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.

జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని తామే కడతామని కేంద్రం ఏపి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా చెప్పింది. తాము అధికారంలోకి వచ్చాక నాబార్దు ద్వారా నిధులు ఇవ్వాలని కోరాం. కేంద్రానికి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాం. ఫిబ్రవరి 2019లో కేంద్ర జలవనరుల శాఖ టీఏసీ రూ.55,548 కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని శక్తివంచన లేకుండా కృషి చేశాం. పనులు ఆపకుండా, కాంట్రాక్టులు రద్దు చేయకుండా ఉంటే ఈపాటికి పోలవరం పనులు ఒక కొలిక్కివచ్చేవి. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది.

20 జనవరి2009.. కేంద్ర జలవనరుల శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టిఏసి) 2005-06 నాటి ప్రాజెక్టు అంచనాలను రూ.10,151.04 కోట్లకు ఆమోదించారు.

4 జనవరి 2011.. 2010-11 అంచనాల ప్రకారం రూ.16,010.48 కోట్లకు ఆమోదించారు.

11 ఫిబ్రవరి 2019.. 2017-18 అంచనాల ప్రకారం రూ.55, 548.87 కోట్లుగా ఆమోదించారు.

20 ఫిబ్రవరి 2014న.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పెరిగిందని, వీటన్నింటికి మేమే ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు.

27 మే 2014.. ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినేట్ లో 7 ముంపు మండలాలను విలీనం చేస్తూ 2014 కంటే ముందు పోలవరంపై పెట్టిన ఖర్చును రాష్ట్ర వాటాగా తీసుకొని మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పారు.

Exit mobile version