నిజానికి, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి, ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. కానీ, ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితుల వేరు. ఒకప్పటి దేశవ్యాప్త పలుకుబడి ఇప్పుడు చంద్రబాబుకి లేదు. అదే అతి పెద్ద సమస్య. మరిప్పుడు చంద్రబాబు ఏం చేయగలరు.? ‘ఇవన్నీ తప్పుడు కేసులు’ అంటూ అప్పుడే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మీడియా సాక్షిగా యాగీ షురూ చేశారు.
కేసులు నమోదయ్యాయి.. నోటీసులు షురూ అయ్యాయి.. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కుతుంది. అక్కడ చంద్రబాబుకి ఊరట దొరికితే సరే సరి. లేదంటే మాత్రం కష్టాలు తప్పవు. ఆ కష్టాలు కూడా అనూహ్యంగా వుండబోతున్నాయి. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పొందుపరిచింది సీబీఐ.
వైసీపీ ఎమ్మెల్యలే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా చంద్రబాబుపై రాజకీయ పోరాటం చేస్తోన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ కేసులు నమోదయ్యాయి. ‘రాజకీయ కుట్ర’ అంటున్న చంద్రబాబు ఆరోపణలు నిజమని తేలుతుందా.? అమరావతిని అడ్డంగా దోచేశారంటోన్న వైసీపీ ఆరోపణలు నిజమని తేలుతుందా.? ఏమో, ఏం జరుగుతుందోగానీ.. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక పెను సంచలనమయ్యే అవకాశముంది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును ఉదహరిస్తూ, చంద్రబాబు మీద కేసులు బలంగా వున్నా.. సుదీర్ఘ కాలం అవి సాగుతూనే వుంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అన్నట్టు, ‘అమరావతిలో కుంభకోణం జరిగితే ఇన్నాళ్ళూ ఏం పీకావ్.?’ అని ఈ మధ్యనే చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఉద్దేశించి నిలదీశారు. ‘ఇదిగో ఇది పీకబోతున్నాం..’ అన్నట్టుగా వుంది అధికార పార్టీ నుంచి రియాక్షన్.