చంద్రబాబు నాయుడు హారతి ఇచ్చిన, గలగంట కొట్టినా.. చెవులో పువ్వు పెట్టుకున్నా..ప్రజలు ఆయన పాలనను తిరస్కరించారు, తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. ఏపీ రాజకీయ చరిత్రను అంతా తిరగేసినా.. ఏనాడూ రాయలసీమలో ఏ ప్రముఖ పార్టీ కూడా మరీ మూడు సీట్లకు పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీ పలు సార్లు ఓడిపోయింది. అయితే అప్పుడు కూడా ఆ పార్టీకి రాయలసీమలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు వచ్చాయి. 2004, 2009లలో కూడా తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో చెప్పుకోదగిన స్థాయిన స్థాయిలో సీట్లొచ్చాయి. అయితే గత పర్యాయం మాత్రం 3 సీట్లకు పరిమితం చేశారు తెలుగుదేశాన్ని రాయలసీమ జనాలు.
ఇక చంద్రబాబు నాయుడి పార్టనర్ పవన్ కల్యాణ్ కు కూడా అంతే స్థాయిలో శాస్తి చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జెండాను మోసుకొచ్చిన వాళ్లను సీమ జనాలు చిత్తు చేశారు. ఎక్కడా డిపాజిట్లు దక్కిన ముచ్చట కూడా లేదు! రాయలసీమ ప్రజలు తెలుగుదేశం, జనసేనల విషయంలో తమ భావన ఏమిటో గత ఎన్నికలతోనే చాటారు. ఎన్నికల్లో ఓటమి అనేది ఏ పార్టీకి అయినా ఒక్కోసారి మామూలే. అయితే మరీ మూడు సీట్లు, సున్నా సీట్లు అనేవి మాత్రం పూర్తి స్థాయి తిరస్కారానికి దర్పణం.
చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను రాయలసీమ ద్రోహులు అని ప్రజలు ఫిక్సయ్యారు. కుప్పంలోనే చంద్రబాబు నాయుడి మెజారిటీ తగ్గిపోయింది. వచ్చేసారి కుప్పంలో పోటీ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఇప్పటి నుంచినే ఆలోచించుకోవాలి. ఇక పవన్ కల్యాణ్ మరోసారి రాయలసీమలో పోటీ అనే ఆలోచన కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే.. వారు ఇప్పుడు సీమకు చేస్తున్న ద్రోహం ఆ స్థాయిలో ఉంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కల్యాణ్ కానీ సమర్థించలేదు. కేసీఆర్ కు భయపడి వీళ్లు ఏపీకి అనుకూలంగా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ అంటే భయం, జగన్ అంటే ద్వేషం.. ఇలాంటి పరిస్థితుల్లో వీరు రాష్ట్రానికి జరగాల్సిన మేలు గురించి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు.
ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయమంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకర్నొకరు తోసుకుంటున్నట్టుగా కనిపిస్తారు. అయితే రాష్ట్రానికి మేలు జరిగే అంశంలో మాత్రం తమ నీఛ రాజకీయాన్నే చూపిస్తున్నారు. తమకు నష్టం లేకపోయినా ఏపీకి మేలు జరుగుతుందంటే తట్టుకోలేనట్టుగా తెలంగాణలో ప్రతిపక్షాలు, అధికార పక్షాల వాళ్లు ఏకం అవుతున్నారు. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు తమ నీఛ రాజకీయమే కీలకం అని భావిస్తున్నారు. ఈ తీరుతో వీళ్లు రాయలసీమ ద్రోహులుగా, ఏపీకే శత్రువులుగా నిలిచి పోతున్నారు.