Advertisement

పెద్దమనిషి.. బురద రాజకీయం.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం

Posted : November 29, 2021 at 8:25 pm IST by ManaTeluguMovies

చంద్రబాబువి బురద రాజకీయాలని విమర్శించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గతంలో బాధితులను ఆదుకోవడానికి కనీసం నెల పట్టలేదని.. ఇప్పుడు వారంలోనే సాయం చేశామని చెప్పుకొచ్చారు.

హుద్ హుద్ తుఫాన్ సందర్భంగా రూ.22 వేల కోట్ల నష్టం జరిగితే.. ఇచ్చింది కేవలం రూ.550 కోట్లేనని గుర్తు చేశారు. అదంతా కేంద్రప్రభుత్వం నుంచే వచ్చిందన్నారు. 22 వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పిన పెద్దమనిషి.. ఇచ్చింది రూ.550 కోట్లేనని తప్పుపట్టారు.

కలెక్టర్లు అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైనా బురద జల్లుతున్నారని చంద్రబాబు తీరును సీఎం జగన్ ను తప్పుపట్టారు. అయితే బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్టపరిహారాన్ని అందించామన్నారు.

గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని.. గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని విమర్శించారు. అలాంటిది ఇవాళ వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని ఆదుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు.

గతంలో రేషన్ నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునే వాళ్లు.. ఇప్పుడు మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని.. గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదన్నారు.

చంద్రబాబు ఉన్న సమయంలో సీజన్ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవని.. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్లుగా చెప్పారు. సీజన్ లోగా వారికి సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.

గతంలో ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని.. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.6 వేల కోట్లు నష్టం జరిగితే.. ఇచ్చింది రూ.34 కోట్లేనని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబును పరోక్షంగా విమర్శించారు.


Advertisement

Recent Random Post:

Neethone Dance 2.0 – Full Promo | Super Star Round | Every Sat & Sun at 9 PM

Posted : April 25, 2024 at 2:34 pm IST by ManaTeluguMovies

Neethone Dance 2.0 – Full Promo | Super Star Round | Every Sat & Sun at 9 PM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement