పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, ముఖ్య నేతలతో నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అక్రమాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు. క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో.. పార్టీ నేతలు బాగా పని చేశారన్నారు.
విద్యుత్ చార్జీలు, పన్నులు పెంచేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. మార్చి నాటికి టీడీపీ ఆవిర్భావానికి 40 ఏళ్లు పూర్తి, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మహానాడు, కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.