ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘అమరావతి వద్దు.. భూములు కావాలా..?’ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన వ్యూహ కమిటీ ఆన్ లైన్ లో సమావేశమైంది. సమావేశంలో.. ‘ఉద్యోగులకు టీడీపీ హయాంలో అనేక ప్రయోజనాలు కల్పించాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటికి కోతలు పెట్టడం ఏంటి? ఉద్యోగులను సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడం ఏంటి? రాజధానిగా అమరావతి వద్దు.. కానీ.. అక్కడి భూములను తనఖా పెడతారా? 400 ఎకరాలకు పైగా భూమిని తనఖా పెట్టడం దుర్మార్గం. మితిమీరిన అప్పులతో రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు’.

‘పాఠశాలల విలీనంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. డిస్కంలకు బకాయిలకు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగాయి. భారతి సిమెంట్ ప్రయోజనాలకు భవన నిర్మాణ రంగాన్ని దెబ్బ తీశారు. టిడ్కో ఇళ్ల పేరుతో తెచ్చిన 7300 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించి.. ఇప్పుడు లబ్దిదారుల పేరుతో 4వేల కోట్ల రుణానికి సిద్ధం కావడం దారుణం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి రీ నోటిఫికేషన్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

Exit mobile version