కష్టాల సుడిలో 800 కుటుంబాలు
ఈ విషయం గురించి చిన్మయి మాట్లాడుతూ.. “కరోనా వల్ల ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఓ రోజు తమిళనాడులోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడి విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా నన్ను కోరాడు. 800 కుటుంబాల దీన పరిస్థితి గురించి వివరాలతో సహా మాకు పూర్తి సమాచారం పంపారు. అది ఎంతవరకు నిజమని కనుక్కునే క్రమంలో ఎన్నో విషయాలు తెలిశాయి. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరికొందరు శారీరక, మానసిక పరిస్థితి బాగోలేనివారు. హఠాత్తుగా వచ్చిపడ్డ కరోనా వైపరీత్యం వల్ల వారికి పూట గడవడమే కష్టంగా మారింది. అప్పుడే నిర్ణయించుకున్నా, వారికి నా వంతు సాయం చేయాల్సిందేనని! అందుకే ఎవరైనా సరే, ఏదైనా పాట కావాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా విరాళమిస్తే చాలు వీడియోలు చేసి పంపించేందుకు డిసైడ్ అయ్యా”నన్నారు. ఎక్కువగా బర్త్‌డే విషెస్ చెప్పమని అడిగేవారని, ఒక్కోరోజు 75 వీడియోలు కూడా చేశానని ఆమె పేర్కొన్నారు.