ఇదిలా ఉంటే చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఎదురవుతోన్న ఇబ్బందుల గురించి చిన్మయికి సోషల్ మీడియా ద్వారా మొరపెట్టుకుంటున్నారు. అందులో కొన్నిటిని చిన్మయి బయటపెడుతోంది. రీసెంట్ గా ఒకమ్మాయి తన తల్లి తనను వేధిస్తోందని, తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని బాధిస్తోందని చిన్మయికి చెప్పింది. దీనిపై చిన్మయి స్పందించింది.
“ఇలాంటి విషయాలపై స్పందించాలి. ఇలాంటివి చూస్తుంటేనే అమ్మాయిలకు తన బాడీ అంటేనే చిరాకు వస్తోంది. రిలేషన్స్ అంటేనే వెగటు అనిపిస్తోంది. మనల్ని కనిపెంచినంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా భరించాల్సిన అవసరం లేదు. ఆర్ధిక స్వతంత్రం వచ్చాక బయటకు వచ్చేయడమే మంచిది. అయితే దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ అవకాశం లేదు” అని చిన్మయి వాపోయింది.