ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘లూసీఫర్‌’ రీమేక్‌ కోసం మాంచి టైటిల్ సెట్టయ్యింది

మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. మలయాళం సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లూసీఫర్‌ సినిమా కథ మరియు స్క్రీన్‌ ప్లేకు కమర్షియల్‌ హంగులు అద్ది సినిమాను రీమేక్‌ చేసేందుకు తమిళ దర్శకుడు మోహన రాజా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఈయన స్క్రిప్ట్ వర్క్‌ దాదాపుగా పూర్తి చేశాడు. ఏప్రిల్‌ లేదా మే నెలల్లో సినిమా ను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు.

సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే టైటిల్ ను ప్రటించాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారు. విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు రారాజు అనే టైటిల్‌ ను ఖరారు చేయడంతో పాటు ఫిల్మ్‌ చాంబర్ లో రిజిస్ట్రర్‌ చేయడం జరిగింది. కథకు తగ్గట్లుగా రారాజు టైటిల్‌ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. లూసీఫర్‌ సినిమా రీమేక్‌ ను జులై నెలలో పట్టాలెక్కించబోతున్నారు.

Exit mobile version