ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మొదలైన మెగాస్టార్‌ ఆక్సీజన్‌ బ్యాంక్ సేవలు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆక్సీజన్‌ కు కొరత వచ్చింది. ఇటీవల ఆక్సీజన్‌ అందక మృతి చెందిన వారి సంఖ్య భారీగా ఉంది. కరోనా సోకినా బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఆక్సీజన్‌ లెవల్స్ కొందరిలో పడిపోతున్నాయి. ఆ సమయంలో వారికి ఆక్సీజన్ అందితే బతికి బట్ట కడుతున్నారు. కాని ఆక్సీజన్‌ అందక పోవడం వల్ల చాలా చోట్ల రోగులు మృతి చెందుతున్నారు. ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో మెగాస్టార్‌ చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

నేటి నుండి అనంతపురం మరియు గుంటూరు జిల్లాల్లో ఆక్సీజన్‌ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఎవరికి ఆక్సీజన్‌ అవసరం అయినా వెంటనే స్పందిస్తామంటూ మెగా చారిటబుల్ వారు ప్రకటించారు. మరి కొన్ని జిల్లాల్లో కూడా ఆక్సీజన్ బ్యాంక్‌ ల ఏర్పాటు దాదాపుగా పూర్తి అయ్యిందని రేపు లేదా ఎల్లుండి నుండి సేవలు అందిస్తామని చెబుతున్నారు. చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ తో వందల ప్రాణాలు కాపాడుకోవచ్చు. బ్లడ్‌ బ్యాంక్ తో కొన్ని వేల మందిని కాపాడిన చిరంజీవి ఈసారి ఆక్సీజన్ తో దేవుడిగా మారాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version