ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మెగాస్టార్ చిరంజీవి అంతలా ఆవేదన చెందాలా.?

చేసిన సాయం గురించి డబ్బులు ఖర్చు చేసి మరీ పబ్లిసిటీ చేసుకోవాల్సిన రోజులివి. ప్రభుత్వాల సంగతి సరే సరి. జనం సొమ్ము ఖర్చపెడుతూ, ఆ జనాన్ని ఉద్ధరించేస్తున్నట్టు నిస్సిగ్గుగా పబ్లసిటీ చేసుకోవడం రాజకీయాల్లో నయా ట్రెండ్. అయితే, కోట్లాదిమంది అభిమానుల్ని కలిగి వున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది, లభిస్తోంది కూడా. ఏనాడూ వీటితో చిరంజీవి సొంత పబ్లిసిటీ చేసుకోలేదు.

ఇక, ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ఆక్సిజన్ కొరత కారణంగా, మెగాస్టార్ చిరంజీవి, ఆక్సిజన్ బ్యాంకుల్ని నెలకొల్పుతున్నారు. తద్వారా చాలామందికి ప్రాణవాయువు అందుతోంది. చిత్రమేంటంటే, తెలుగు మీడియాలో మెజార్టీ మీడియా సంస్థలు మెగాస్టార్ చిరంజీవిని లైట్ తీసుకున్నాయి. ‘సోనూ సూద్ గురించి ఉచిత పబ్లిసిటీ ఇచ్చుకున్న కులగజ్జి మీడియా (పచ్చ మీడియా, బులుగు మీడియా), మన మెగాస్టార్ చిరంజీవి దగ్గరకొచ్చేసరికి మాత్రం, ‘చేపల పులుసు’ పేరుతో సెటైర్లు వేసింది. ఎంతైనా పాచిపోయిన పొరుగింటి పుల్లకూరలోని టేస్ట్ మన కులగజ్జి మీడియాకి మాత్రమే తెలుసు.

చిరంజీవి.. అన్న పేరే ఈ కుల గజ్జి మీడియాకి నచ్చదు. అందుకే, ప్రజారాజ్యం పార్టీ విషయంలోనూ ఈ కులగజ్జి మీడియా విషం చిమ్మింది. జనసేన విషయంలోనూ అదే చేసింది. ‘మెగా కాంపౌండ్’కి సంబంధించి జుగుప్సాకరమైన వార్తలు వండి వడ్డించడం తప్ప, ఈ కులగజ్జి మీడియాకి ఇంకో పనే వుండదు. ఆ కాంపౌండ్ మీద రాతలు రాయకపోతే, ఆయా మీడియా సంస్థలు బతికి బట్టకట్టలేనంత బానిసత్వంలో వున్నాయవి. ఆయా పార్టీలకు బానిసల్లా బతుకున్న ఈ కులగజ్జి మీడియా సంస్థలు, మెగా కాంపౌండ్ మీద అందుకే విషం చిమ్మేది.

ఇక్కడ సోనూ సూద్ అనే వ్యక్తిని తప్పు పట్టలేం. తనకున్న పరిధిలో సోనూ సూద్ చేస్తున్న సేవని ప్రశంసించాల్సిందే. అదే సమయంలో, మెగాస్టార్ చిరంజీవిని మన కులగజ్జి మీడియా గుర్తించడంలేదన్న ఆవేదన మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో బాగా నాటుకుపోయింది. కొంతమేర మెగాస్టార్ కూడా ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఓ పత్రికలో మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఆక్సిజన్ బ్యాంకులపై ప్రశంసలు గుప్పిస్తూ కథనం రావడం తెలుగునాట సంచలనమైంది.

ఆ పత్రిక అధినేతతో చిరంజీవి మాట్లాడారు. తెలుగు మీడియాలో కొందరి నుంచి ప్రోత్సాహం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గుర్తింపు బోల్డంత బలాన్నిస్తుంది. అదే బహుశా చిరంజీవి ఆశించి వుండొచ్చు. అయినాగానీ, సినీ రంగంలో ఏ అండా దండా లేకుండా మెగాస్టార్.. తెలుగు సినీ పరిశ్రమ పెద్దన్న.. అనే స్థాయికి ఎదిగిన చిరంజీవికి.. ఈ కులగజ్జి మీడియా నుంచి ఎదురయ్యే అడ్డంకులు పెద్ద కష్టమేమీ కాదు.

నిజానికి, చిరంజీవి సదరు కులగజ్జి మీడియా గురించి పట్టించుకోకపోవడమే మంచిది. మంచిని జీర్ణించుకోలేక అసహనంతో రగిలిపోయి మొరిగే కులగజ్జి మీడియా నుంచి ‘గుర్తింపు’ ఆశించడమంటేనే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కోట్లాదిమంది అభిమానులున్నారు.. సోషల్ మీడియానే అత్యద్భుతమైన వేదిక ఈ రోజుల్లో. అన్నిటికీ మించి, సాయం పొందిన గుండెలు చెప్పే ఒక్క ‘థ్యాంక్స్’ మిలియన్ ఓల్టుల శక్తిని అందిస్తుంది. జై చిరంజీవ.!

Exit mobile version