సాయి పల్లవి కూడా దాదాపుగా ఓకే చెప్పింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాత్రలకు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు సాయి పల్లవి ఎప్పుడు ఓకే చెప్తుంది. అందుకే ఈ సినిమాలో ఆమె నటించడం పక్కా అనుకున్నారు. కాని డేట్లు క్లాష్ అవ్వడంతో పాటు ఇతర కారణాల వల్ల భోళా శంకర్ సినిమా నుండి సాయి పల్లవి తప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సాయి పల్లవి స్థానంను మరో స్టార్ హీరోయిన్ తో ఫిల్ చేయించాలనే ఉద్దేశ్యంతో సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఏంటీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెల్సిందే.
తమిళం మరియు తెలుగు లో మోస్ట్ వాంటెడ్ మరియు మోస్ట్ కాస్ట్లీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాకు తీసుకున్న పారితోషికం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాదారణంగా తెలుగు సినిమాల్లో హీరో చెల్లి పాత్రకు.. క్యారెక్టర్ ఆర్టిస్టుకు పారితోషికం చాలా తక్కువగానే ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే రోజు వారి పారితోషికంను ఎక్కువ శాతం ఇస్తూ ఉంటారు. కాని ఈ సినిమాలో కీర్తి సురేష్ చేస్తున్న పాత్రకు గాను భారీగాను ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు కమిట్ అయిన కీర్తి సురేష్ కు ఆ నిర్మాతలు ఎంతగా ఇస్తున్నారో భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్రకు అంతకు మించి ఇస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు లో కీర్తి సురేష్ కు భారీగా పారితోషికం దక్కతుంది. హీరోయిన్ గా నటించినందుకు గాను కీర్తి సురేష్ ఏ స్థాయిలో పారితోషికం అయితే తీసుకుంటుందో అదే పారితోషికంను భోళా శంకర్ మేకర్స్ కూడా ఆమెకు ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. రికార్డు స్థాయిలో కీర్తి సురేష్ కు దక్కిన ఈ పారితోషికం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది.
ఆమె పారితోషికంకు పూర్తి న్యాయం చేస్తుందని రాఖీ సందర్బంగా విడుదల అయిన వీడియో గ్లిమ్స్ తోనే నిరూపించింది. చిరంజీవికి చెల్లిగా అద్బుంగా కీర్తి సురేష్ కనిపించబోతుంది.. సినిమాకు ఆమె తప్పకుండా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అనే నమ్మకంను మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.