Advertisement

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరంజీవి..?

Posted : May 26, 2022 at 7:25 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ”భోళా శంకర్” ఒకటి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ కు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చిరు ‘భోళా శంకర్’ చిత్రంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారట.

ఈ నేపథ్యంలోనే సినిమాలో పవన్ నటించిన ‘ఖుషి’ సీన్ ని రిపీట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ – భూమిక ల మధ్య వచ్చే నడుము సీన్ ఎంత హైలైట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని ‘భోళా శంకర్’ లో స్పూఫ్ గా వాడుతున్నారట.

చిరంజీవి – యాంకర్ శ్రీముఖి మధ్య ఆ సీన్ రాబోతుందని అంటున్నారు. ఇందులో చిరంజీవి రొమాంటిక్ చూపులు – డైలాగ్స్ ఆ సన్నివేశంలో అదిరిపోయేలా వచ్చాయని.. అందుకు అనుగుణంగానే శ్రీముఖి హావభావాలు పలికించిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

మెగాస్టార్ రేంజ్ ఏంటి.. తన తమ్ముడు పవన్ కు ఫ్యాన్ గా నటించడం ఏంటి.. ‘ఖుషి’ నడుము సీన్ స్పూఫ్ లో నటించడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మెహర్ రమేష్ ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతారో లేదో చూడాలి.

ఇకపోతే సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది.

రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

డూడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. చిరంజీవి హాలిడే నుంచి వచ్చిన తర్వాత ‘భోళాశంకర్’ తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుంది.


Advertisement

Recent Random Post:

Tenant Making Video | Satyam Rajesh, Megha | Yugandhar | Chandrashekhar Reddy | Sahityya Sagar

Posted : April 17, 2024 at 6:33 pm IST by ManaTeluguMovies

Tenant Making Video | Satyam Rajesh, Megha | Yugandhar | Chandrashekhar Reddy | Sahityya Sagar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement