రైటర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న బాబీ దర్శకుడిగా మాత్రం ఇంకా పూర్తిగా నిరూపించుకోలేకపోయాడు. ‘జై లవకుశ’, ‘వెంకీ మామ’ సినిమాలతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం హీరోల ఖాతాల్లోకే వెళ్లింది. గత ఏడాది వచ్చిన ‘వెంకీమామ’అయితే పోటీ లేకపోవడంతో హిట్టు మెట్టు ఎక్కింది కానీ కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం ఉండదు.
మరి ఇలాంటి టైమ్‌లో మెగాస్టార్, బాబీకి ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తాడా అని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. అయితే తండ్రి సినిమా విషయాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్న రామ్ చరణ్‌ను బాబీ ఇంప్రెస్ చేయగలిగితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు సినీ జనాలు.
ఇకపోతే మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ చేయాలని ఫిక్స్ అయిన చిరూ, ఇందుకోసం దర్శకుడిగా సుజిత్‌ను కన్ఫార్మ్ చేసినట్టు ఆల్రెడీ స్వయంగా ఒక ఇంటర్యూలో తెలిపారు. ఆలెడ్రీ ‘లూసిఫర్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కావడంతో స్కిప్టులో మార్పులు చేయాలని దర్శకుడుకు సూచించారట. ఇందుకోసం లాక్‌డౌన్ టైమ్‌ను ఫుల్లుగా వాడుతున్నాడు సుజిత్.