ఐతే ఈ చిత్రానికి దర్శకుడిగా ఓ వైపు సుజీత్ (సాహో ఫేమ్), మరోవైపు బాబీ (జై లవకుశ, వెంకీ మామ డైరెక్టర్)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి కంటే ముందు ఒక దశలో సుకుమార్ పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయంలో ఇక ఊహాగానాలకు అవకాశం లేకుండా చిరునే స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లూసిఫర్ రీమేక్ దర్శకుడెవరన్నది చిరు తేల్చేశాడు.
లూసిఫర్ రీమేక్ కోసం సుజీత్‌తో కలిసి పని చేయాలని తన కొడుకు, ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ తనకు సూచించినట్లు చిరు వెల్లడించాడు. అతను ఇప్పటికే స్క్రిప్టు మీద పని చేస్తున్నాడని.. ఒరిజినల్లో కొన్ని మార్పులు కూడా సూచించాడని.. లాక్ డౌన్ టైంలో తాము వీడియో కాల్స్ ద్వారా ఈ స్క్రిప్టుపై చర్చిస్తున్నామని చిరు తెలిపాడు. మెగాస్టార్ ఇంత స్పష్టంగా చెప్పాక ఇక లూసిఫర్ రీమేక్ దర్శకుడెవరనే విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేనట్లే.
ఐతే తొలి రెండు సినిమాల్లో స్టైలిష్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్లకు పేరు పడ్డ సుజీత్.. లూసిఫర్ లాంటి రాజకీయాలు, సెంటిమెంట్ల చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీని ఎలా డీల్ చేస్తాడన్నది ఆసక్తికరం. ఆల్రెడీ తెలుగులో రిలీజైన సినిమా.. జనాలకు కథ, ఇతర విశేషాలన్నీ ముందే తెలుసు. ఈ నేపథ్యంలో లూసిఫర్ రీమేక్‌కు తనదైన టచ్ ఇచ్చి ప్రేక్షకుల్ని మెప్పించడం సుజీత్‌కు సవాలే.