ఇంతకీ విషయం ఏమిటంటే మలయాళ సినిమా లూసిఫర్ ను ముచ్చటపడి తెలుగు హక్కులు కొనిపించారు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తో. ఆ సినిమాలో మోహన్ లాల్ చేసిన ఇంటెన్సివ్ క్యారెక్టర్ ను చేయాలని ఆయన సంకల్పం. స్క్రిప్ట్ డిస్కషన్లు, పనులు చాలా కాలం గా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా వుంటుందా? వుండదా? అని గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి.
ఈ సినిమాలో చనిపోయే సిఎమ్ క్యారెక్టర్, మామ పోయాక ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే సిఎమ్ అల్లుడు పాత్ర, సిఎమ్ కొడుకు క్యారెక్టర్లు, ప్రభుత్వాన్ని కాపాడే కీలక నాయకుడు క్యారెక్టర్ వున్నాయి. నిజానికి పోలిటికల్ డైలాగులు ఏవీ ఈ సినిమాలో వుండవు. కానీ స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎడ్జ్ మీద వెళ్లాలి. ఏమాత్రం అటు ఇటు అయినా వర్తమాన రాజకీయాలను, పార్టీలను, నాయకులను ఎక్కడ ఏమూల అయినా, ఏ మాత్రం అయినా టచ్ అయితే అనవసరపు తలకాయనొప్పులు వస్తాయి.
అసలే ఉభయరాష్ట్రాల రాజకీయాలు చాలా సెన్సిటివ్ గా వున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇలాంటి సినిమా చేయడం అవసరమా ? అన్న సలహాలు మెగాస్టార్ కు అందుతున్నాయని, దాంతో ఆయన ముందు వెనుక ఆడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఈ విధంగా మెగాస్టార్ ను వెనక్కు లాగుతున్నది డైరక్టర్ ఎవరో అన్న దాని మీద కూడా గుసగుసలు వినిపస్తున్నాయి.
నిజానికి లూసిఫర్ అన్నది మంచి సినిమా అని, ఈ విషయంలో మెగాస్టార్ ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది