Advertisement

చిరంజీవి సినిమాను కన్ ఫర్మ్ చేసిన పవన్

Posted : September 3, 2020 at 4:31 pm IST by ManaTeluguMovies

చిరంజీవి పుట్టినరోజుకు ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ చిరు-మెహర్ రమేష్ కాంబినేషన్ పై ప్రకటన రాలేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం, ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానంటున్నాడు. మూడేళ్లుగా దానికోసమే కష్టపడుతున్నానని ప్రకటించాడు. ఓవైపు చిరంజీవి-మెహర్ కాంబినేషన్ లో ప్రకటన రాకపోయినా.. ఆ సినిమా ఉందనే విషయాన్ని పవన్ కల్యాణ్ కన్ ఫర్మ్ చేశారు.

అవును.. ఏకంగా ట్విట్టర్ లో పవన్ ఈ మేటర్ పెట్టడం విశేషం.

పుట్టినరోజు నాడు పవన్ ను విష్ చేశాడు మెహర్. “వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలంటూ ” 2 ఫొటోలు కూడా పెట్టాడు. దానికి ఈరోజు రిప్లయ్ ఇచ్చారు పవన్. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ చెబుతూనే.. చిరంజీవితో చేయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇలా చిరంజీవి కన్ ఫర్మ్ చేయకపోయినా.. చిరు-మెహర్ కాంబోను పవన్ కన్ ఫర్మ్ చేశారు.

తమిళ్ లో సూపర్ హిట్టయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్ కు అప్పగించారు చిరు. ఇప్పటికే చేయాల్సిన మార్పుచేర్పులు చేసిన మెహర్.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే పవన్ ఇలా అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.


Advertisement

Recent Random Post:

నాగ శౌర్య పెళ్లి వేడుకలు Naga shaurya-Anusha Shetty Wedding LIVE

Posted : November 20, 2022 at 4:35 pm IST by ManaTeluguMovies

Watch నాగ శౌర్య పెళ్లి వేడుకలు Naga shaurya-Anusha Shetty Wedding LIVE

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement