ఇక రీసెంట్ గా చిరంజీవి మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్ ను కన్ఫర్మ్ చేసాడు చిరు. దీనికి మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. దాదాపు మూడేళ్ళ పాటు ఈ సినిమా స్క్రిప్ట్ మీద మెహర్ వర్క్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవలే చిరుకు స్క్రిప్ట్ వినిపించగా చిరంజీవి పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడట. ఒక్క ఛేంజ్ కూడా చెప్పకుండా స్క్రిప్ట్ ను లాక్ చేయమని అన్నాడట. అయితే చిరంజీవి ఒకే ఒక్క కండిషన్ మాత్రం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే వేదాళం రీమేక్ కు ఒక బడ్జెట్ అనుకుని దాన్ని దాటి మాత్రం సినిమాను తీయొద్దని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టాడట.
ఎందుకంటే మెహర్ గతంలో తీసిన సినిమాల్లో భారీ తనం పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేయించాడు. వాటి ఫలితంగా చిరంజీవి ఈసారి జాగ్రత్త పడాలనుకుంటున్నాడట. మరి ఈ రిస్క్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.