చిన్న పిల్లల అభిరుచిని అర్థం చేసుకుని వారిలోని నైపుణ్యంను మెరుగు పెట్టాలి. చిన్నారుల అభిరుచిని తల్లిదండ్రులు పోత్సహిస్తే అది వారిలో ఉత్సాహంను నింపుతుందని చిరంజీవి పేర్కొన్నారు. సుష్మత కూతురు అంటూ చిరంజీవి సంహితను తన పోస్ట్ ద్వారా ఈ పాపను తన ఫాలోవర్స్ కు పరిచయం చేశాడు.
మెగాస్టార్ ఈమద్య కాలంలో చిరంజీవి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్లు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తన మనవరాళ్లు మనవడికి సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేశాడు. తాజాగా సంహిత రుద్రమ వీడియోను షేర్ చేయడం ద్వారా అభిమానులకు తన మరో మనవరాలిని పరిచయం చేశాడు.
ఇక చిరంజీవి ప్రస్తుతం కరోనా టైం అవ్వడం వల్ల సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నాడు. ఆయన త్వరలోనే ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.