Advertisement

మాస్ కి కేరాఫ్ అడ్రస్.. 29 ఏళ్ల మెగాస్టార్ ‘రౌడీఅల్లుడు’

Posted : October 18, 2020 at 4:06 pm IST by ManaTeluguMovies

మాస్ క్రేజ్, మాస్ ఇమేజ్ అనే పదాలకు కొత్త అర్ధాన్ని తీసుకొచ్చిన హీరో చిరంజీవి. తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా, మెగాస్టార్ గా ఆయన తిరుగులేని ఆధిపత్యానికి కారణం ఈ మాస్ మంత్రమే. చిరంజీవికి అప్రతిహతమైన మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘రౌడీ అల్లుడు’ ఒకటి. ఒక హీరోకు ఇండస్ట్రీ వచ్చాక.. తర్వాత చేసే సినిమా హిట్ కొట్టడం చాలా కష్టమైన విషయం. కానీ.. చిరంజీవి రౌడీ అల్లుడుతో ఆ మ్యాజిక్ చేసి చూపించారు. ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ తర్వాత వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. 1991 అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమాకు నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి.

సినిమాలో ఆటో జానీగా చిరంజీవి నటన ఆయన ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘దొంగమొగుడు’ కథకు దగ్గరి పోలికలతోనే ద్విపాత్రాభినయం చేశారు. కానీ.. చిరంజీవి మార్క్ వన్ మ్యాన్ షో సినిమాకు తిరుగులేని విజయం సాధించిపెట్టింది. ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించారు చిరంజీవి. తనలోని మాస్ యాక్టింగ్ లెవల్స్ కు రౌడీ అల్లుడు మరో ఉదాహరణగా నిలిచింది. రఫ్ గడ్డంతో ‘బాక్సు బద్దలైపోద్ది..’ అంటూ చిరంజీవి చెప్పిన మేనరిజమ్ అప్పట్లో ఓ సెన్సేషన్. చిరంజీవి బ్రాండ్ గా ఇప్పటికీ ఉండిపోయింది.

చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్. బప్పీలహరి సంగీతంలోని అద్భుతమైన పాటలకు చిరంజీవి చేసిన డ్యాన్సులతో ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై పంజా ప్రసాద్, కె.వెంకటేశ్వర రావు, నిర్మాతలుగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఈ సినిమా నిర్మించారు. తన చెల్లెళ్ల కోసం ఈ సినిమా నిర్మించారు చిరంజీవి. 33 సెంటర్లలో 100 రోజులు రన్ అయింది. చెన్నైలో శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు.


Advertisement

Recent Random Post:

KTR Tweet : పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా కేటీఆర్ ట్వీట్

Posted : March 29, 2024 at 1:10 pm IST by ManaTeluguMovies

KTR Tweet : పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా కేటీఆర్ ట్వీట్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement