మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే క్రాక్ చిత్రాన్ని చూసి ఇంప్రెస్స్ అయ్యాడు. వెంటనే రవితేజ, గోపీచంద్ మలినేనిలకు ఫోన్ చేసి అభినందించారు. దర్శకుడ్ని పర్సనల్ గా కలవమని పిలుపునిచ్చారు. ఈరోజు చిరంజీవిని గోపీచంద్ మలినేని కలిసాడు.
మెగాస్టార్ ను కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని గోపీచంద్ ఈ సందర్భంగా అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. ఇది తనకు మెగా డే అని వ్యాఖ్యానించాడు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన క్రాక్ రవితేజ కెరీర్ లో కంబ్యాక్ ఫిల్మ్ అనవచ్చు. ఎందుకంటే నాలుగు సినిమాల తర్వాత రవితేజ ఈ సినిమాతో సక్సెస్ సాధించాడు.