ఇక మెగా అభిమానుల కోసం ఒక మాస్ మసాలా పాటను చిరు మరియు చరణ్ కాంబోలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వచ్చిన మాటల మాదిరిగా అలా వచ్చి ఇలా అన్నట్లుగా కాకుండా తండ్రి కొడుకు ఇద్దరు కూడా పాటలో ఫూర్తి స్థాయిలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పాట కోసం మాస్ మసాలా బీట్ ను ట్యూన్ చేయించడంతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దించబోతున్నారు. ఈ పాటను చిత్రీకరించి సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. వచ్చే నెలలో ఆ పాట చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. సినిమా ను మే లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.