ఎవర్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘దత్త పుత్రుడు’ అని విమర్శిస్తున్నారు.? ఎవరి గురించి బానిసత్వం లాంటి మాటలు మాట్లాడుతున్నారు.? పోనీ, వైఎస్ జగన్ ఆరోపిస్తున్నట్లుగా టీడీపీకి చంద్రబాబు దత్త పుత్రుడేనని కాస్సేపు అనుకుందాం. టీడీపీకి పవన్ బానిసత్వం చేస్తున్నారనే కాస్సేపు భావిద్దాం.
టీడీపీ ఏమన్నా కేంద్రంలో అధికారంలో వుందా.? పవన్ కళ్యాణ్ మీద అక్రమాస్తుల కేసులు ఏమన్నా వున్నాయా.? టీడీపీ రాష్ట్రంలో అధికారంలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా పదవులు తీసుకుని వుంటే, టీడీపీకి పవన్ కళ్యాణ్ బానిసత్వం చేశారనే మాటల్లో అర్థం వుండాలి.
అన్నిటికీ మించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సినిమాలు తప్ప అడ్డగోలు వ్యాపారాలేవీ లేవు. సిమెంటు ఫ్యాక్టరీలు లేవు, మీడియా సంస్థలూ లేవు. మరి, ఏ కోణంలో టీడీపీకి పవన్ కళ్యాణ్ దత్తత వెళ్ళాలి.? టీడీపీకి పవన్ ఎందుకు బానిసత్వం చేయాలి.?
ఎవరో స్థాపించిన పార్టీని, వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. వైసీపీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్ కాదు. వేరే వ్యక్తి నుంచి పార్టీని తీసుకున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు.. వెరసి ఏం చేయగలిగినట్టు.? కేంద్రాన్ని ప్రశ్నించి, ప్రత్యేక హోదా సాధించగలిగారా.? రాష్ట్రానికి రాజధాని కట్టగలిగారా.?
ఎవరికి బానిసత్వం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసినట్లు.? ఎవరికి దత్తత వెళ్ళి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టు.? కేసుల మాఫీ కోసం బానిసత్వం చేయడం, దత్తతకు వెళ్ళడం తప్ప, వైసీపీ గడచిన మూడేళ్ళలో రాష్ట్రాన్ని ఉద్ధరించిందేమీ లేదు. పైగా, ఇలాంటి పార్టీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడమా.? జనసేన నుంచి ఈ స్థాయిలో ఎదురుదాడి షురూ అవుతుందని వైసీపీ కలలో కూడా ఊహించి వుండదేమో.!