రీసెంట్ గా ఇండియా టుడేతో ముచ్చటించిన డేవిడ్ వార్నర్ అసలు టిక్ టాక్ చేయడానికి గల కారణాలు చెప్పాడు. కరోనా మహమ్మారి ఉదృత్తంగా ఉన్న సమయంలో ప్రజలు అందరూ వివిధ కష్టాలు పడుతున్నారని, వారి ముఖాలపై చిరునవ్వులు చిందించడం కోసమే ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చాడు వార్నర్.
అలాగే తనకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మధ్య తేడాలు తెలియవని, అభిమానులు తనను ఏ పాటను చేయమని ఎక్కువ కోరారో ఆ టిక్ టాక్ లు చేసానని తెలిపాడు. మొదట బుట్ట బొమ్మను ఎక్కువమంది కోరారు. దాంతో ఆ టిక్ టాక్ చేశా. ఏదేమైనా భారతీయ పాటలకు డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఎంతో శ్రద్ధతో పాటు కఠిన శ్రమ ఉండాలి. నేను చేసిన టిక్ టాక్ లకు కూడా చాలా ప్రాక్టీస్ చేశాను అని తెలిపాడు వార్నర్.