ఈ నేపథ్యంలో మరో బయోపిక్ తెరపైకి రాబోతోంది. అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తండ్రి ప్రకాష్ పదుకునే బయోపిక్. ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆయన ఇండియాకు అత్యున్నత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా 1980లో వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రికార్డు ని నెలకొల్పారు. అంతే కాకుండా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించారు.
ఈ ఫీట్ లు రికార్డులు సాధించడం వెనక ఆయన పడిన కఠోర శ్రమ వుందని ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని భావించిన దీపిక పదుకోన్ తన తండ్రి ప్రకాష్ పదుకోన్ జీవిత కథ ఆధారంగా పారన్ ఇండియా స్థాయిలో ఓ భారీ బయోపిక్ కు శ్రీకారం చుడుతోంది. ఈ విషయాన్ని దీపిక స్వయంగా వెల్లడించింది. `నాన్నా ప్రకాష్ పదుకోన్ జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే ఆయన బయోపిక్ తీయాలనుకుంటున్నాను` అని తెలిపింది.
అంతే కాకుండా భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవకముందే మా నాన్నగారు అథ్లెట్ గా దేశ క్రీడా ఖ్యాతిని విశ్వవేదికపై రెప రెపలాడించారు. అథ్లెట్ గా నాన్న సాధన చేయడానికి అప్పట్లో మెరుగైన సౌకర్యాలు ఉండేవి కావు. పెళ్లి మండపాల్లో సాధన చేసేవారు.
తన బలహీనలను బాలాలుగా మార్చుకునేందుకు నిరంతరం కృషిచేశారు. ఆయన జీవితం చాలా మందికి స్ఫూర్తి దాయకం. అందుకు ఆయన బయోపిక్ ని నిర్మించాలని ప్రయత్నాలు మొదలుపెట్టానని తెలిపింది దీపిక. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు.