దిల్ రాజు బ్యానర్ లో శంకర్.. రామ్ చరణ్ ల మూవీ జులై లో మొదలు కాబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబో మూవీ ఆలస్యం అయ్యేలా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు చరణ్ మరే సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదంటున్నారు. అందుకే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ ముగించుకునే వరకు కూడా శంకర్ వెయిట్ చేయాల్సి వస్తుందట.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమా కోసం ఏడాది పాటు వెయిట్ చేసిన శంకర్ మరి కొన్నాళ్ల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది చివరి వరకు రామ్ చరణ్ తో శంకర్ మూవీ మొదలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా విడుదల కోసం 2023 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.