Advertisement

వాలు చూపులు మెహందీ టచ్ తో గుండె గిల్లిన దివి

Posted : May 25, 2022 at 10:44 pm IST by ManaTeluguMovies

దివి వద్యత .. చూస్తుండగానే కెరీర్ పరంగా బిజీ అయిపోయిన ఈ బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాల్లోను అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటోంది. నటి కం మోడల్ దివి వద్యత బిగ్ బాస్ బ్యూటీగా తెలుగు వారికి సుపరిచితం. `మహర్షి`లో పూజాహెగ్గే ప్రెండ్ పాత్రతో మెప్పించిన దివి ఆ తర్వాత కొన్ని సహాయక పాత్రలతోనూ ఆకట్టుకుంది. అయితే దివిలో హాట్ కంటెంట్ ఇటీవల ప్రముఖంగా హైలైట్ అవుతోంది.

దివి ఎప్పటికప్పుడు హాటెస్ట్ ఫోటోషూట్లను ఇన్ స్టాలో పోస్ట్ చేసి హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టా బ్యూటీగా బాగా పాపులర్ అయింది. నిరంతరం కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరించడం తనకి ఫాలోయింగ్ ని పెంచుతోంది. గ్లామరస్ లుక్ తో పాటు .. ట్రెడిషనల్ గాళ్ గాను దివి వైరల్ గా దూసుకెళుతోంది. తాజాగా దివి అందమైన చీరలో కనిపించింది. ఓ ఫోటోలో చేతులకు ఉన్న మెహందీని ఆవిష్కరించగా వేరొక ఫోటోలో దివి బ్యాక్ లెస్ లుక్ హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దివి లుక్ పై ఇన్ స్టా ఫాలోవర్స్ కామెంట్లు పతాక స్థాయికి చేరుతున్నాయి. వాలు చూపులు మెహందీ టచ్ తో గుండె గిల్లిన దివికి ఐ లవ్ యు చెబుతున్నారు ఫ్యాన్స్.

హైదరాబాద్ కి చెందిన దివి నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం `బిగ్ బాస్ సీజన్-4 `కంటెంస్టెంట్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దివి పెర్ఫామెన్స్ మ్యాటర్ కి వస్తే.. `లెట్స్ గో` అనే చిత్రం దివి తొలి సినిమా. కానీ ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి`లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రతో ఆడియన్స్ కి రీచ్ అయింది. ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. సోషల్ మీడియా క్వీన్ గా టాప్ మోడల్ గా ఆదాయ ఆర్జన బావుందని తెలిసింది. నటిగా కెరీర్ పరంగా కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తోంది. మునుముందు మెగా అక్కినేని అవకాశాలతో దూసుకెళుతుందనే భావిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

టీడీపీ టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోందా..? | Hot Seat

Posted : April 17, 2024 at 9:16 pm IST by ManaTeluguMovies

టీడీపీ టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోందా..? | Hot Seat

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement