ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఏడుగురు సీనియర్ కేంద్ర మంత్రులు రాజీనామా

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంను పునర్‌ వ్యవస్థీకరించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన కేబినేట్ లో ఉన్న పలువురు మంత్రులు రాజీనామా చేశారు. మొత్తంగా ఏడుగురు సీనియర్ మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రి వర్గంను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మంత్రి వర్గం నుండి తప్పుకున్న వారిలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌తో పాటు సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్‌ సాహెబ్‌ పాటిల్‌, సంజయ్ దోత్రే, సంతోష్‌ గంగ్వార్‌, రమేష్‌ పోఖ్రియాల్‌లు ఉన్నారు. కొత్త మంత్రి వర్గంలో ఉన్నత చదువులు చదివిన వారు ఉంటారని తెలుస్తోంది. 13 మంది న్యాయ వాదులు మరియు 6 మంది డాక్టర్లు, 5 మంది ఇంజనీర్లు ఉండనున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఈ మంత్రి వర్గ వ్యవస్థీకరణ కు రాబోయే ఎన్నికలు కారణం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Exit mobile version