Advertisement

డ్రీమ్ గర్ల్ విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

Posted : May 13, 2020 at 11:12 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన డ్రీమ్‌ గర్ల్‌ చిత్రాన్ని తెలుగులో రాజ్‌ తరుణ్‌ హీరోగా రీమేక్‌ చేయబోతున్నట్లుగా గతంలో ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ సమ్మర్‌లో ప్రారంభించాల్సి ఉంది. కాని లాక్‌డౌన్‌తో పాటు రాజ్‌ తరుణ్‌ గత చిత్రాలు పరాభవం పాలయ్యాయి. ఇదే సమయంలో రాజ్‌ తరుణ్‌ నటించిన ఒక సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. ఆ కారణాల వల్ల డ్రీమ్‌ గర్ల్‌ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. డ్రీమ్‌ గర్ల్‌ సినిమా రీమేక్‌ ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆ సినిమా షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్స్‌ ప్రారంభం అవుతాయని, ఆ వెంటనే షూటింగ్‌ ప్రారంభిస్తామంటూ ప్రకటించారు.

తెలుగులో డ్రీమ్‌ గర్ల్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో రాజ్‌ తరుణ్‌ ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమాను రీమేక్‌ చేసి సక్సెస్‌ను కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మరి ఈసారి అయినా రాజ్‌ తరుణ్‌కు సక్సెస్‌ దక్కేనా చూడాలి. గత రెండేళ్లుగా రాజ్‌ తరుణ్‌కు సక్సెస్‌ అనేది లేకుండా పోయింది. అందుకే ఈ సినిమా సక్సెస్‌ ఆయనకు చాలా కీలకంగా మారింది.


Advertisement

Recent Random Post:

Extra Jabardasth Latest Promo – 19th April 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Posted : April 17, 2024 at 2:29 pm IST by ManaTeluguMovies

Extra Jabardasth Latest Promo – 19th April 2024 – Rashmi Gautam,Kushboo,Immanuel,Bullet Bhaskar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement