షరతులతో కూడిన బెయిల్ ను ధూళిపాళ్లకు ఇవ్వడం జరిగింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని అలాగే ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామాను విచారణ అధికారులకు ఇవ్వాలంటూ న్యాయ స్థానం ఆదేశించింది. ఇక విచారణకు విధిగా హాజరు కావాలంటూ ఆదేశించడంతో పాటు అధికారులకు విచారణ కోసం 24 గంటల ముందుగానే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. బెయిల్ మంజూరు అవ్వడంతో ధూళిపాళ్ల విడుదల అవ్వబోతున్నాడు. ఆయనతో పాటు సంఘం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కు కూడా బెయిల్ మంజూరు అయ్యింది.