Advertisement

కరోనా కేసులే తగ్గాయి.. కానీ ఇకముందే అసలు ప్రమాదం: మంత్రి ఈటెల

Posted : November 1, 2020 at 8:38 pm IST by ManaTeluguMovies

రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం దేశంలో కరోనా పరిస్థితిపై ఓ ప్రకటన చేసింది. ‘కరోనా కేసులే తగ్గాయి.. తీవ్రత అలానే ఉంది. వచ్చేది చలికాలం. కరోనా తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. అందరూ విధిగా మాస్కులు ధరించాలి’ అని. ఇప్పుడు తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇదే స్పష్టం చేస్తున్నారు.

కరోనా మళ్ళీ వ్యాపించే అవకాశం ఉంది. ప్రజలు మాస్కుల వినియోగం, సానిటైజర్ వినియోగం పై మరింతగా అప్రమ్మత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉన్నా అలసత్వం పనికిరాదని స్పష్టం చేశారు. అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరగడం.. దేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరును ఆయన ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఈటెల పైవిధంగా స్పందించారు.

కరోనా వ్యాక్సిన్ పై కూడా మంత్రి స్పందించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలకు త్వరితగతిన అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్ కొరత ఉండకూడదన్నారు. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పట్టణాల్లో మున్సిపల్ శాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఇటీవల దసరా, బతుకమ్మ పండుగల నేపధ్యంలో ప్రజలు గుంపులుగా చేరారు. ఈ నేపధ్యంలో కేసుల సంఖ్యా పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రతపై శీతాకాలం ప్రభావం ఉంటుందని కూడా భావిస్తోంది.


Advertisement

Recent Random Post:

Gunshots Heard Outside Salman Khan’s Home In Mumbai, Police Investigate

Posted : April 14, 2024 at 9:45 pm IST by ManaTeluguMovies

Gunshots Heard Outside Salman Khan’s Home In Mumbai, Police Investigate

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement