కరోనా మళ్ళీ వ్యాపించే అవకాశం ఉంది. ప్రజలు మాస్కుల వినియోగం, సానిటైజర్ వినియోగం పై మరింతగా అప్రమ్మత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉన్నా అలసత్వం పనికిరాదని స్పష్టం చేశారు. అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరగడం.. దేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరును ఆయన ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఈటెల పైవిధంగా స్పందించారు.
కరోనా వ్యాక్సిన్ పై కూడా మంత్రి స్పందించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలకు త్వరితగతిన అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్ కొరత ఉండకూడదన్నారు. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పట్టణాల్లో మున్సిపల్ శాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఇటీవల దసరా, బతుకమ్మ పండుగల నేపధ్యంలో ప్రజలు గుంపులుగా చేరారు. ఈ నేపధ్యంలో కేసుల సంఖ్యా పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రతపై శీతాకాలం ప్రభావం ఉంటుందని కూడా భావిస్తోంది.